
యాక్షన్ డైరెక్టర్ ‘ప్రశాంత్ నీల్’ – నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న క్రేజీ మూవీ “సలార్”లో సెకెండ్ హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించబోతుందట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీలో హీరోయిన్ గా చేసినా.. శ్రీనిధి శెట్టికి చెప్పుకోతగ్గ స్థాయిలో స్టార్ డమ్ రాలేదు. అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. అయితే, తానూ రాసుకున్న కథలో ఓ కీలక పాత్రలో శ్రీనిధి పర్ఫెక్ట్ గా సరిపోతుందని ప్రశాంత్ ఆమెను తీసుకున్నాడట. శ్రీనిధి శెట్టిని హీరోయిన్ ను చేసింది ప్రశాంతే.
Also Read: బ్యాంక్ డీటెయిల్స్ చెప్తే సంకనాకి పోతారు.. బ్రహ్మానందం వైరల్ వీడియో!
ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పాన్ ఇండియా హీరోయిన్ ఉండబోతుందని.. ఎలాగూ ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్ అంటే.. నేషనల్ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందనే టాక్ ఉంది. ఇప్పటికే సాహోలో శ్రద్ధాకపూర్ తో నటించాడు ప్రభాస్. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న మరో పాన్ ఇండియా సైన్స్ – ఫిక్షన్ మూవీలో దీపిక పదుకోణును హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అలాగే ఆదిపురుష్ లో కృతి సనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.
Also Read: ‘ఉప్పెన’ కోసం ఇంత రిస్కా..? ముందే తెలిస్తే వద్దనేవాణ్నిః నాగబాబు
కాగా ఇప్పుడు ఇదే ఊపులో సలార్ కోసం కూడా మరో పాన్ ఇండియా మూవీని తీసుకుంటారట. రీసెంట్ గా అయితే కత్రినాకైఫ్ ను తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. మరి ఏ స్టార్ హీరోయిన్ని ఫైనల్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ని ఢీకొట్టడానికి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం తీసుకోబోతున్నారు. త్వరలోనే దీనికి సంబందించిన అప్డేట్ అధికారకంగా ప్రకటిస్తారట. ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్