Maruthi: సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఈవెంట్స్ లో మాట్లాడేటప్పుడు, ఆచి తూచి మాట్లాడాలి. సవాళ్లు విసరడం, అభిమానులకు లేని పోనీ ప్రమాణాలు చేయడం వంటివి మంచిది కాదు. గత ఏడాది ‘వార్ 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాగవంశీ లేని పోనీ ప్రమాణాలు చేసి, యాటిట్యూడ్ తో మాట్లాడిన మాటలకు అతను ఎదురుకున్న పరిణామాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ ఒక్కరు చూసారు. దెబ్బకు ఇకపై నేను మైక్ అందుకోను అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ‘రాజా సాబ్’ డైరెక్టర్ మారుతీ పరిస్థితి కూడా అంతే. ప్రభాస్ ఫ్యాన్స్ రోజుకి ఒక కొత్త ఐడియా తో మారుతీ చేత నరకం స్పెల్లింగ్ రాయిస్తున్నారు. ‘రాజా సాబ్’ చిత్రం ప్రభాస్ ని ఇష్టపడే ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోతే నా అడ్రస్ ఇస్తున్నాను, అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అడ్రస్ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ మారుతీ.
ఇంత గట్టిగా చెప్పాడంటే సినిమా ఔట్పుట్ వేరే లెవెల్ లో వచ్చిందేమో అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ప్రీమియర్ షోస్ కి వెళ్లిన అభిమానులు తీవ్రమైన నిరాశతో ఇంటికి తిరిగొచ్చారు. డైరెక్టర్ మారుతీ పని తీరు పై కారాలు మిరియాలు నూరుతూ సోషల్ మీడియా లో మొదటి రోజు నుండి అతన్ని ట్యాగ్ చేస్తూ బూతులు తిడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అంతే కాదు, అడ్రస్ కూడా ఇచ్చాడు కాబట్టి, అతని ఇంటికి నిన్న మొన్నటి వరకు లెటర్స్ గుట్టలు గుట్టలుగా పంపించారు. అక్కడితో ఆగకుండా వందల సంఖ్యలో స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ ఫుడ్ ఆర్దార్లు పెట్టారు. ఒక్కసారిగా ఇన్ని ఆర్దర్లు రావడం తో మారుతీ సిబ్బంది కంగుతిన్నారు. ఈ విషయాన్నీ మారుతీ కి తెలియజేయగా, నేను ఎలాంటి ఫుడ్ ఆర్డర్స్ పెట్టలేదని, వచ్చిన వాళ్ళను వెనక్కి పంపేయాలని చెప్పాడట.
ప్రతీ రోజు ఈ ఫుడ్ ఆర్డర్ల వ్యవహారం మారుతీ సిబ్బంది కి పెద్ద తలనొప్పిగా మారిందట. ఇలా రోజుకి ఒక యాంగిల్ లో డైరెక్టర్ మారుతీ ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక్కడ అభిమానులు ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఏ డైరెక్టర్ కూడా ఒక సినిమాని ఫ్లాప్ అవ్వాలని తియ్యరు, కచ్చితంగా సూపర్ హిట్ సినిమాని తియ్యాలి అనే ఆశతో , కసితో కష్టపడి పని చేస్తుంటారు. డైరెక్టర్ మారుతీ ఆరోజు ఆ రేంజ్ లో ఈ సినిమా గురించి చెప్పాడంటే, అతను తీసిన ఔట్పుట్ పై సంతృప్తి గా ఉన్నాడు. అది ఆయన నమ్మకం, అందుకే అంత గట్టిగా చెప్పాడు. కానీ ఆడియన్స్ కి ఆ చిత్రం నచ్చలేదు. ఒక్కోసారి ఇలా అవుతుంటాయి, అభిమానులు సీరియస్ గా తీసుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.