https://oktelugu.com/

Prabhas-Gopichand: గోపిచంద్, ప్రభాస్ కాంబోలో నిజంగానే మల్టీ స్టారర్ సినిమా వస్తుందా..? అసలు మ్యాటరేంటంటే..?

ప్రభాస్ గోపీచంద్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమా రాబోతుందనే న్యూస్ 'బిల్లా ' సినిమా తర్వాత నుంచి వినిపిస్తుంది. దానికి కారణం ఏంటి అంటే అప్పట్లో పూరి జగన్నాథ్ వీళ్ళిద్దరికీ సెట్ అయ్యే ఒక స్టోరీని రాసుకొని ఇద్దరికీ చెప్పాడట.

Written By:
  • Gopi
  • , Updated On : March 2, 2024 / 02:39 PM IST
    Follow us on

    Prabhas-Gopichand: తెలుగు హీరోల్లో కటౌట్ చూడగానే హీరో అనిపించేలా ఉండే నటులలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటే, ఆయన తర్వాత స్థానంలో గోపీచంద్ ఉంటాడు. గోపీచంద్ ను చూస్తే పర్ఫెక్ట్ గా హీరో అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. కేవలం కటౌట్ తోనే అంతటి మ్యాజిక్ ను క్రియేట్ చేయగలిగే హీరో గోపీచంద్. ఇక ఆయన పోలీస్ డ్రెస్ వేసి సినిమా చేస్తే మాత్రం ఆ సినిమాకి ఉండే హైప్ అంతా ఇంతా కాదు. ఇక ఇప్పటికే ‘గోలీమార్ ‘ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకున్న గోపీచంద్..

    ప్రస్తుతం భీమా(Bheema) సినిమాతో పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక టీవీ షోలో పాల్గొన్న గోపీచంద్ ప్రభాస్(Prabhas) తో సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ షో ప్రోమోలో ప్రభాస్ తో మల్టీ స్టారర్ సినిమా ఉందా లేదా అనేది క్లారిటీగా చెప్పలేదు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ గోపీచంద్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమా రాబోతుందనే న్యూస్ ‘బిల్లా ‘ సినిమా తర్వాత నుంచి వినిపిస్తుంది. దానికి కారణం ఏంటి అంటే అప్పట్లో పూరి జగన్నాథ్ వీళ్ళిద్దరికీ సెట్ అయ్యే ఒక స్టోరీని రాసుకొని ఇద్దరికీ చెప్పాడట.

    ఆ స్టోరీ ఇద్దరికీ నచ్చింది. కానీ ఆ సినిమా చేద్దాం అనుకునే లోపే ప్రభాస్ బాహుబలి సినిమాకి స్టిక్ అయిపోవడం వల్ల ఆ ప్రాజెక్టు అటకెక్కింది. ఇక ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టు గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు తప్ప కొత్తగా వీళ్ళ కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమా అయితే రావడం లేదు.ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మూడు సంవత్సరాల పాటు ఆయన డేట్స్ అయితే ఖాళీగా లేవు. ఇక మూడు సంవత్సరాల తర్వాత వీళ్ళ కాంబో లో మల్టీ స్టారర్ సినిమా వస్తుందా అంటే అప్పటివరకు ఎవరు ఏ రేంజ్ లో ఉండేది ఎవరికి తెలియదు.

    నిజానికి ప్రభాస్ గోపీచంద్ తో మల్టీస్టారర్ సినిమా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గోపిచంద్ కి సరిగ్గా 50 కోట్ల మార్కెట్ కూడా లేదు. కానీ ప్రభాస్ మాత్రం బాహుబలి 2 సినిమాతో 2 వేల కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. ఇలాంటి సమయం లో ప్రభాస్ గోపిచంద్ తో సినిమా చేయాల్సిన అవసరమైతే లేదు. కానీ ప్రభాస్ ఫ్రెండ్ గా గోపీచంద్ కోసం మంచి స్టోరీ దొరికితే సినిమా చేస్తాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం వీళ్లిద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడం అనేది చాలా కష్టమనే చెప్పాలి…