https://oktelugu.com/

Krishna Vamsi: స్టార్ ప్రొడ్యూసర్ ఇచ్చిన బ్లాంక్ చెక్ ను రిజెక్ట్ చేసిన కృష్ణ వంశీ…

రాజమౌళి లాంటి డైరెక్టర్ ను మనం ఒక ఉదాహరణ గా తీసుకోవచ్చు. ఎక్కడో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకునే రాజమౌళి ప్రస్తుతం ప్రపంచ సినిమా తీసే స్థాయికి ఎదిగాడు అంటే మామూలు విషయం కాదు.

Written By:
  • Gopi
  • , Updated On : March 2, 2024 / 02:47 PM IST
    Follow us on

    Krishna Vamsi: సినిమా ఇండస్ట్రీ లో కొంతమంది డైరెక్టర్లు డబ్బుల కోసం సినిమాలు చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం డైరెక్షన్ మీద ప్యాషన్ తో సినిమాలు చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఏ కథతో, ఎవరితో అయితే సినిమా చేయాలనుకుంటున్నారో వాళ్ల డేట్స్ కోసం వెయిట్ చేస్తారు. ఆ స్క్రిప్ట్ లో వాళ్ళని తప్ప వేరొకరిని ఊహించుకోలేరు. ఒక వేళ వీళ్ళు చెప్పిన స్టోరీ వాళ్ళకి నచ్చకపోతే ఆ స్టోరీ లో వేరే హీరోను సెట్ చేస్తారు కానీ లేకపోతే మాత్రం ముందు వాళ్ళు ఏ హీరోకి అయితే స్టిక్ అయ్యారో వాళ్ళతోనే సినిమాలు చేస్తారు. అలా డెడికేటెడ్ గా ఉన్నప్పుడే వాళ్ళు సక్సెస్ ఫుల్ సినిమా తీయగలరాని నమ్ముతుంటారు.

    ఇక ఇలాంటి వాళ్లలో రాజమౌళి(Rajamouli) లాంటి డైరెక్టర్ ను మనం ఒక ఉదాహరణ గా తీసుకోవచ్చు. ఎక్కడో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకునే రాజమౌళి ప్రస్తుతం ప్రపంచ సినిమా తీసే స్థాయికి ఎదిగాడు అంటే మామూలు విషయం కాదు. ఇక ఇలాంటి సంకల్పంతో ముందుకు సాగినప్పుడు మాత్రమే ఆ దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో రాణించగలుగుతాడు…

    ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే క్రియేటివ్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న కృష్ణవంశీ(Krishna Vamsi) ఖడ్గం సినిమా తర్వాత ఒక స్టార్ ప్రొడ్యూసర్ తన దగ్గరికి వచ్చి బ్లాంక్ చెక్ ఇచ్చి తను చెప్పిన కథతో సినిమా చేయమని, దానికోసం స్టార్ హీరో డేట్స్ ని కూడా తీసుకొస్తానని చెప్పాడట. కానీ కృష్ణవంశీ కి ఆయన మాట్లాడిన విధానం గానీ, ఆయన చెప్పిన స్టోరీ లైన్ గాని నచ్చలేదట. అయితే ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు అనేది ఆయన ఎప్పుడు బయట పెట్టలేదు గానీ, ఆయన చెప్పిన స్టోరీ మాత్రం ఒక అడల్ట్ సినిమా కంటెంట్ కావడంతో తీవ్రంగా కోపానికి వచ్చిన కృష్ణవంశీ నేను అలాంటి సినిమాలు తీయమని చెప్పి ఆయన ఇచ్చిన బ్లాంక్ చెక్ ను ఆయనకు తిరిగిచ్చాడట..

    నేను ఎలాంటి స్టోరీలు అయితే రాసుకుంటానో, ఆ స్టోరీలతోనే సినిమాలు చేస్తాను. నాకు మోరల్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. వాటిని దాటి డబ్బుల కోసం సినిమా చేసే స్థాయికి అయితే నేను దిగజారలేదు అని ఆ స్టార్ ప్రొడ్యూసర్ కి గట్టి కౌంటర్ ఇచ్చాడట. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్ట పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది… అలా కృష్ణవంశీ తనకు సంతృప్తినిచ్చే సినిమాలు మాత్రమే చేస్తాడు తప్ప, డబ్బుల కోసం ఆయన సినిమాలు చేయడు అని చెప్పడానికి ఈ సంఘటన ను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు…