Ghani: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తోన్న సినిమా గని. తాజాగా, ఈ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. ప్రతి ఒక్కరి కథలో కష్టాలు ఉంటాయి. కన్నీళ్లు ఉంటాయి.. కోరుకలూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఛాంపియన్ అవ్వాలని ఉంటుంది. అయితే ఛాంపియన్ అయ్యేది ఒక్కడే.. ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి.. వై..యూ… ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావు.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు.. పవర్ఫుల్ డైలాగ్‌తో ఈ టీజర్ విడుదలైంది.
కిరణ్ కొర్పపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం వరుణ్ పూర్తిగా తన లుక్‌ను మార్చుకున్నారు. బాక్సింగ్ ఛాంపియన్‌గా కనిపించేందుకు తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. ఈ సినిమాలో వరుణ్ సిక్స్‌ప్యాక్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. వరుణ్ అలా కనిపించడానికి వెనక కఠోర శ్రమ దాగి ఉందని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఆరడుగులకుపైగా పొడవుతో.. సిక్స్‌ప్యాక్ లుక్‌తో అచ్చం హాలీవుడ్ హీరోను తలపిస్తున్నారు వరుణ్. ఈ సినిమాలో వరుణ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తోంది. సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
వరుణ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, అంతరిక్షం, ఎఫ్2 ఇలా చేసిన ప్రతి సినిమాలో కొత్తదనం కనిపిస్తుంది. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను ఎలా అలరించనున్నాడో తెలియాల్సి ఉంది.