Samantha: సమంత జీతంలో ఈ ఏడాది పెనుమార్పు తీసుకొచ్చింది. తన జీవితంలో ఆమె ఈ సంవత్సరాన్ని మర్చిపోలేదు. అందుకే, జరిగిన చెడుకి, జరగబోయే మంచికి ఈ ఏడాది అత్యున్నతమైనది అంటూ సామ్ తన సన్నిహితుల దగ్గర చెబుతుందట. నాగచైతన్యతో విడిపోయాక, సమంతలో చాలా మార్పులు వచ్చాయి. ఆమె చిరునవ్వులో వైరాగ్యం కనిపిస్తోంది. ఆమె కళ్ళల్లో నైరాశ్యం కనిపిస్తోంది.

అందుకే, ఒంటరిగా ఉండి, తనలో తాను నలిగిపోవడం ఇష్టం లేకే, మళ్ళీ సినిమాల్లో బిజీ అయి, మానసికంగా కలిగిన ఆవేదనల నుండి బయట పడాలని సామ్ బలంగా కోరుకుంటుంది. అందుకే, తన సినీ కెరీర్ పై మరింత శ్రద్ధ పెట్టింది. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ ముందుకుపోతుంది. ప్రస్తుతం సమంత చేతిలో మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి.
పైగా వాటిల్లో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలే. అలాగే నిన్నటి నుంచి సమంత ఓ హాలీవుడ్ సినిమాలో సైతం నటించబోతోంది అంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ వార్తలో వాస్తవం ఎంత ఉంది అనేది ఇంకా స్పష్టం కాలేదు గాని, సమంత మాత్రం ‘అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోందని సమంత సన్నిహితుల నుంచి అందుతున్న అప్ డేట్.
అదేవిధంగా పుష్పలో ఓ ఐటెమ్ సాంగ్ ఉంది. ఆ ఐటెమ్ గీతంలోనూ సమంత నటించడానికి ఒప్పుకుందని కూడా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ ఐటమ్ సాంగ్ కోసం పూజా హెగ్డే, తమన్నాలను సంప్రదించారు. అయితే, సమంత స్వయంగా బన్నీకి ఫోన్ చేసి మరీ, ఆ సాంగ్ నేను చేస్తాను అంటూ కోరిందట. పైగా ఈ నెల 26న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.
Also Read: Ghani: పవర్ఫుల్ ప్యాక్‌తో గని టీజర్.. వరుణ్ సిక్స్‌ప్యాక్‌కు అభిమానులు ఫిదా!
ఈ మధ్య సమంత ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తోందని, ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుందని తెలుస్తోంది. చైతూ ఇక తన జీవితంలో లేడని బాధ పడుతూనే.. ఇక తనకు అతని అవసరం లేదని కూడా సమంత అందరికీ చెబుతుంది. ఏది ఏమైనా విడాకుల తర్వాత సమంతలో చాలా మార్పు వచ్చింది.
Also Read: Karthikeya: కార్తికేయ వివాహానికి ముహూర్తం ఖరారు.. నెట్టింట శుభలేఖ వైరల్!