spot_img
Homeఎంటర్టైన్మెంట్Game Changer Collections : గేమ్ చేంజర్' 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..తమిళ...

Game Changer Collections : గేమ్ చేంజర్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..తమిళ వెర్షన్ లో భారీ నష్టాలు..ఇప్పటి వరకు అక్కడ ఎంత వచ్చిందంటే!

Game Changer Collections :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఫలితం ఎలా వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే. మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, సోషల్ మీడియా నెగటివిటీ కి మరింత దారుణంగా బలి అయ్యింది. కొంతమంది పనిగట్టుకొని ఈ సినిమాపై నెగటివ్ ప్రచారం చేయడమే కాకుండా, HD ప్రింట్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం సంచలనం గా మారింది. నెగటివ్ టాక్ ఎలాగో వచ్చింది, ఇక థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని ఏమి చూస్తాములే అని, అనేక మంది ప్రేక్షకులు డౌన్లోడ్ చేసుకొని ఈ సినిమాని చూసారు. ఈ ప్రభావం చాలా గట్టిగానే పడిందని నిర్మాతలు అంటున్నారు. లీక్ చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే ఇంత నెగటివిటీ మధ్యలో కూడా ఈ చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో వసూళ్లను రాబడుతుంది.

ఆ వసూళ్లు బ్రేక్ ఈవెన్ కి ఏ మాత్రం సరిపోనివి కానప్పటికీ, థియేటర్స్ కి మాత్రం ఫీడింగ్ ఇచ్చే రేంజ్ లో రన్ ఉంది. విడుదలై పది రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 204 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. షేర్ వసూళ్లు దాదాపుగా 110 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆదివారం ఈ సినిమాకి కలిసొస్తుందని బయ్యర్స్ ఆశించారు కానీ, ఆరోజున కేవలం కోటి రూపాయిల షేర్ మాత్రమే తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టిందట. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ పదవ రోజు 3 కోట్ల రూపాయిల వరకు వచ్చిందని అంటున్నారు. హిందీ వెర్షన్ వసూళ్లు పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చాయి.

తమిళ వెర్షన్ లో శంకర్ బ్రాండ్ ఇమేజ్ కలిసొచ్చి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ భారీ నష్టాలను మిగిలించింది ఈ చిత్రం. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 16 కోట్ల రూపాయలకు జరిగింది. ఆదిత్య రామ్ అనే వ్యక్తి ఈ రైట్స్ ని కొనుగోలు చేసాడు. గతంలో ఈయన ప్రభాస్ తో ‘ఏక్ నిరంజన్’ అనే సినిమాని తీసి భారీ నష్టాలను మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత సినీ రంగానికి దూరంగా జరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కాలం గడిపాడు. మళ్ళీ గేమ్ చేంజర్ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయనకి మళ్ళీ చేదు అనుభవమే ఎదురైంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి తమిళనాడు నుండి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 11 కోట్లు రావాలి, అది అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper