Bhairavam Official Teaser : ‘అల్లుడు శ్రీను’ సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మొదటి సినిమాతోనే సక్సెస్ ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా తర్వాత ఈయన నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం సక్సెస్ లు లేకపోయినా, మాస్ ఆడియన్స్ కి మాత్రం బాగానే దగ్గరయ్యాడు. మధ్యలో బాలీవుడ్ లోకి ‘ఛత్రపతి’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఆయన, ఇప్పుడు ‘భైరవం’ అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. తమిళంలో లో సూపర్ హిట్ గా నిల్చిన ‘గరుడన్’ కి రీమేక్ ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘గరుడన్’ లో సూరి హీరో గా నటించగా, ఉన్ని ముకుందన్ మరియు శశికుమార్ ముఖ్య పాత్రలు పోషించారు.
తెలుగులో సూరి క్యారక్టర్ ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తుండగా, ఉన్ని ముకుందన్ క్యారక్టర్ ని మంచు మనోజ్, శశికుమార్ క్యారక్టర్ ని నారా రోహిత్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ నేడు సాయంత్రం జరిగింది. ఈ టీజర్ కి సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ని, మంచు మనోజ్ ని సినిమాల్లో చూసి ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. ఈ టీజర్ లో ముగ్గురు హీరోలను చాలా పవర్ ఫుల్ గా చూపించారు, కానీ మెయిన్ హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నట్టు హైలైట్ చేసారు. ఇందులో మనోజ్, నారా రోహిత్ అన్నదమ్ములుగా నటిస్తే, వాళ్లకు రక్షణ కవచం లాగా బెల్లం కొండా సాయి శ్రీనివాస్ కనిపించాడు. టీజర్ చివర్లో బెల్లంకొండ శ్రీనివాస్ కి అమ్మవారు పూనినట్టుగా డ్యాన్స్ వేయడం హైలైట్ గా నిల్చింది.
ఈ చిత్రం ద్వారా ఆయన తనలోని నటనని బయటకి తీసినట్టుగా అనిపించింది. పెర్ఫార్మన్స్ కి చాలా మంచి స్కోప్ ఉన్న పాత్ర అది. టీజర్ లో మీరు చూసిన షాట్స్ మొత్తం ఇంటర్వెల్ సన్నివేశానికి సంబంధించినవే. ఇందులో మనోజ్ నెగటివ్ రోల్ లో కనిపిస్తాడు. మొదటి నుండి తన అన్నయ్య నారా రోహిత్ కి స్నేహం గా ఉంటూనే, చివర్లో వెన్నుపోటు పొడిచే పాత్ర ఆయనది. మంచి కాన్సెప్ట్ , తమిళం లో గత ఏడాది విడుదలై చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాతో బెల్లం కొండా సాయి శ్రీనివాస్ తో పాటు, నారా రోహిత్, మంచు మనోజ్ కం బ్యాక్ కూడా అని చెప్పొచ్చు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమ్మర్ లోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీ టీజర్ ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాలను తెలియచేయండి.