Kolkata Doctor case
Kolkata Doctor case: ఈ ఘటనకు సంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్ కారణమని పోలీసులు గుర్తించారు.. ఆ తర్వాత ఆస్పత్రిలో కొంతమంది దుండగులు ప్రవేశించి ఆధారాలను నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఆస్పత్రి వైద్యులు ధర్నా చేస్తున్న చోటు వద్దకు వెళ్లి బీభత్సం సృష్టించారు. ఆ తర్వాత ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మధ్యలో రాజకీయ పార్టీలు ప్రవేశించడంతో రచ్చ రచ్చ అయింది. మొదట్లో డాక్టర్లతో చర్చలు జరుపుతామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. మొదటిసారి చర్చలు విఫలమయ్యాయి. రెండవసారి కూడా విఫలమయ్యాయి. మూడోసారి ఫలప్రదమయ్యాయి. అయినప్పటికీ డాక్టర్ల డిమాండ్లను నేటికీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నెరవేర్చడం లేదు. ఇక ఈ కేసు రకరకాల మలుపులు తిరిగింది.. ఆస్పత్రి ప్రిన్సిపాల్, సమీప పోలీస్ స్టేషన్ అధికారి పై పోలీసులు అనుబంధ చార్జ్ షీట్ నమోదు చేయలేదు. ఆ తర్వాత వారికి బెయిల్ లభించింది. అయితే ఈ ఘటన జరిగిన 162 రోజుల తర్వాత సిల్దా కోర్టు తీర్పును వెలువరించింది.. భారత న్యాయ సంహిత లోని సెక్షన్ ఆధారంగా సంజయ్ కి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 50వేల జరిమానా కూడా చెల్లించాలని పేర్కొంది.. అయితే సిల్దా కోర్టు వెలువరించిన తీర్పుపై సంజయ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.. కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం అతడిని 500 మంది పోలీసుల బందోబస్తు మధ్య సిల్దా కోర్టుకు తరలించారు. శిక్ష విధించే కంటే ముందు అతడికి తన వాదనను వినిపించుకునేందుకు జడ్జి అవకాశం ఇచ్చారు.
సంజయ్ ఏమంటున్నాడంటే..
” నేను ఏ నేరం చేయలేదు.. ఎటువంటి కారణం లేకుండానే ఇందులో ఇరికించారు. నాతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. నేను అమాయకుడిని. ఈ కేసులో అనేక ఆధారాలు ధ్వంసమయ్యాయి.. ఇలాంటి క్రమంలో నన్ను ఎలా దోషిగా నిర్ధారిస్తారు? శిక్ష ఎలా విధిస్తారని” అతడు ప్రశ్నించాడు.. ఈ కేసును విచారించిన సిబిఐ న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపించాడు..” ఇది చాలా అరుదైన కేసు. ఈ ఘటన వల్ల సమాజం తీవ్రంగా ప్రభావితమైంది. సంజయ్ కి కచ్చితంగా ఉరిశిక్ష విధించాలి. వైద్యులకు రక్షణ లేనప్పుడు.. ఇంకా ఏం చేస్తే బాగుపడుతుంది ఈ సమాజం?” అని ఆయన తన వాదనలు వినిపించారు. మరోవైపు కోర్టు 17 లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పు ఇవ్వడంతో.. దానిని బాధిత డాక్టర్ తల్లిదండ్రులు తిరస్కరించారు. ” మాకు ఎలాంటి పరిహారం వద్దు. న్యాయం మాత్రమే కావాలి.. అతడికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నామని” వారు పేర్కొన్నారు.. మరోవైపు ఈ తీర్పుపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. ” దోషికి కఠిన శిక్ష పడాలని డిమాండ్లు వినిపించాయి. తాను తీర్పు మాత్రం ఎందుకు విరుద్ధంగా వచ్చింది. కోర్టు తీర్పుతో అసంతృప్తికి గురి చేసిందని” మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
Today, the Court has pronounced death sentence for the convict who had raped and murdered the small girl of Gurap and I thank the Judiciary for that.
I thank Hooghly Rural District Police for their swift action and thorough probe that ensured speedy trial and conviction in 54…
— Mamata Banerjee (@MamataOfficial) January 17, 2025
#WATCH | Advocate Rehman says, “Additional Judge of Sessions court, Sealdah has sentenced life imprisonment till death to Sanjay Roy. The court directed the state government to give compensation of Rs 17 lakhs to the victim’s family. CBI had demanded capital punishment for the… pic.twitter.com/fBl7fxEPIt
— ANI (@ANI) January 20, 2025
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Life imprisonment for the accused in the kolkata arji car hospital incident
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com