Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తూ ఉన్నారు అంటే ఆ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయం సినీ ఇండస్ట్రీలో అలానే తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాలపై అందరికీ ఉండే ఆసక్తి అలాంటిది.
ఇక ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ తరువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒప్పుకో ఉన్న స్టార్ హీరో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావడం విశేషం. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. షూటింగ్ ఆలస్యం అవుతున్నా కానీ ఈ చిత్రంపై ప్రేక్షకులకు రవ్వంత కూడా అంచనాలు తగ్గడం లేదు.
అందులో ఈ చిత్రం గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరి శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక అప్డేట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
చాలా రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ ని ఈమధ్య మళ్లీ తిరిగి ప్రారంభించారు. లేటెస్ట్ షెడ్యూల్లో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. పవన్ ఈ షూటింగ్ లో అలా జాయిన్ అయ్యాడో లేదో చంద్రబాబు అరెస్ట్ తో మళ్ళీ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక నిన్నే పవన్ మళ్ళీ సెట్స్ లో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అలనాటి సీనియర్ నటి గౌతమి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్, గౌతమీ లపై హరీష్ శంకర్ కొన్ని కీలక సన్నివేశాలను సైతం చిత్రీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సినిమాలో ఆమె పవన్ కి తల్లిగా కనిపించనిందని అంటున్నారు.
ఒకప్పుడు హీరోయిన్ గా మంచి పాత్రలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న గౌతమి ఈ మధ్యకాలంలో పలు తెలుగు చిత్రాల్లో తల్లి పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా గౌతమి ‘శాకుంతలం’, ‘అన్ని మంచి శకునములే’ వంటి సినిమాల్లో కనిపించారు. ఇక ఇదే వరవడి కొనసాగిస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా తల్లిగా కనిపించనున్నారు అని తెలుస్తోంది. కాగా ఇదే విషయం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా చిత్ర యూనిట్ దగ్గర నుంచి రావాల్సి ఉంది.