TS TET 2023: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మొత్తం 2,052 పరీక్ష కేంద్రాల్లో పేపర్ 1 కు 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. టెట్ పరీక్ష నేపథ్యంలో పరీక్ష నిర్వహించే విద్యాసంస్థలకు గురువారం హాప్ డే హాలీడే ప్రకటించారు. శుక్రవారం సెలవు ప్రకటించారు. మిగతా విద్యాసంస్థలు యధాతథంగా సాగుతాయి. ఈ నేపథ్యంలో టెట్ రాసే అభ్యర్థులకు విద్యాశాఖ కొన్ని నిబంధనలు పెట్టింది. వీటిని ఉల్షంఘిస్తే చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని తెలిపింది.
టెట్ రాసే పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. చీఫ్ సూపరింటెండెట్ల కార్యాలయాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలను తెరుస్టారు. పరీక్ష నిర్వహణకు 2,052 చీఫ్ సూపరింటెండెంట్ల, 22,572 ఇన్విజిలేటర్లు, 10,260 హాల్ సూపరింటెండెంట్లను నియమించారు. ఈ మేరకు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఈ తరుణంలో అభ్యర్థులు పాటించాల్సిన నియమాలనుఆయన వివరించారు.
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 నిర్వహిస్తారు. పరీక్షకు హాజరయ్యేవారు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని తెలిపారు. ఓఎంఆర్ షీట్ ను బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోనే పూరించాలి. ఇతర రంగు పెన్నులను అనుమతించరు. బ్లూ పెన్ తో వస్తే లోనికి అనుమతించరు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంలలోనే. మధ్యాహ్నం 2 గంటల లోపు హాల్ లోకి రావాల్సి ఉంటుంది. అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే 25/97 యాక్ట్ ప్రకారం చర్యలుంటాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి హెచ్చరించారు. ఓఎంఆర్ షీట్ ను మలవడం గాగీ, పిన్నులు కొట్టడం గానీ, ట్యాంపరింగ్ చేయడంగా చేయొద్దన్నారు.