Brahmamudi : స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్న బ్లాక్ బస్టర్ సీరియల్స్ లో ఒకటి ‘బ్రహ్మముడి'(Bramhamudi Serial). దాదాపుగా రెండేళ్ల నుండి ఈ సీరియల్ విరామం లేకుండా దిగ్విజయం గా కొనసాగుతుంది. ఈ సీరియల్ లో కావ్య క్యారక్టర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గరైంది. ఆ క్యారక్టర్ ని తమిళ అమ్మాయి దీపికా చేసింది. సీరియల్ లో చాలా పద్దతిగా సీరియస్ గా కనిపించే దీపిక(Deepika), బయట మాత్రం చాలా అల్లరి అమ్మాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ మా ఛానల్ లో ఎంటర్టైన్మెంట్ షోస్ ని బాగా చూసే వాళ్లకు కావ్య ఏ రేంజ్ ఎంటర్టైనర్ అనేది తెలిసే ఉంటుంది. కేవలం టీవీ సీరియల్ ద్వారా మాత్రమే కాదు, ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఈమెకు మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడూ చలాకీగా కనిపించే ఈ అమ్మాయి కచ్చితంగా సినిమాల్లోకి వెళ్లి సక్సెస్ సాదిస్తుందని అందరూ అనుకున్నారు.
Also Read : పెళ్లి పీటలెక్కబోతున్న బ్రహ్మముడి హీరోయిన్.. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
ఆ దిశగానే ఈ అమ్మాయి అడుగులు వేస్తుందా అంటే అవుననే చెప్పాలి. రీసెంట్ గా ఈమె నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) తో కలిసి ‘ఆశీర్వాద్ చిల్లీ పౌడర్'(Ashirwad Chilli Powder) యాడ్ లో కనిపించింది. దమ్ము మీదే స్టార్ మీరే అనే టైటిల్ తో వచ్చిన ఈ యాడ్ వీడియో యూట్యూబ్ ని ఊపేస్తోంది. దీపిక కు నాని తో కలిసి ఒక పూర్తి స్థాయి యాడ్ చేసే అవకాశం దక్కిండంటే, కచ్చితంగా ఈమె మన టాలీవుడ్ డైరెక్టర్స్ దృష్టిలో పడింది అనే అనుకోవాలి. రాబోయే రోజుల్లో ఈమెను వెండితెర పై కూడా చూడొచ్చు. ఇకపోతే ఈమె కచ్చితంగా ‘బిగ్ బాస్ 9’ తెలుగు సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో తనకు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ఆసక్తి ఉన్నట్టుగా దీపిక చెప్పింది కాబట్టి, ఈ సీజన్ లో ఆమె అడుగుపెట్టడం దాదాపుగా ఖరారు అయ్యినట్టే.
గేమ్స్ ఎలా ఆడుతుందో తెలియదు కానీ, దీపిక ద్వారా ఆడియన్స్ కి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతే కాకుండా ఇన్ని రోజులు దీపిక లో ఫన్ యాంగిల్ ని మాత్రమే ఆడియన్స్ ఇన్ని రోజులు చూసారు, బిగ్ బాస్ షో ద్వారా ఆమెలో దాగి ఉన్న మరికొన్ని యాంగిల్స్ కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అవి పాజిటివ్ అయినా, నెగటివ్ అయినా, కచ్చితంగా ఈమె మన ఆడియన్స్ కి ఈ రియాలిటీ షో ద్వారా మరింత దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఈమెకు సినిమా అవకాశాలు కూడా ఈ రియాలిటీ షో ద్వారా రావొచ్చు. ప్రస్తుతం ఈమె బ్రహ్మముడి సీరియల్ తో పాటు ఆహా యాప్ లో ‘డ్యాన్స్ ఐకాన్ 2’, ‘చెఫ్ మంత్ర’ వంటి షోస్ లో కూడా పాల్గొంటుంది.
Also Read : రాజ్ ఇంటికి తిరిగొచ్చిన కావ్య, అంతలోనే ట్విస్ట్… అనామిక రీ ఎంట్రీ, అప్పు-కళ్యాణ్ లకు వార్నింగ్!