Homeఎంటర్టైన్మెంట్Eagle: సంక్రాంతి బరి...

Eagle: సంక్రాంతి బరి నుంచి ఈగల్ మూవీ ఔట్… అసలు కారణం ఇదే…

Eagle: సాధారణంగా పండుగ సీజన్ వచ్చిందంటే చాలు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులకు మంచి ఆనందాన్ని ఇస్తు ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సంక్రాంతి బరిలో ఇప్పటివరకు ఐదు సినిమాలు నిలిచాయి కానీ రీసెంట్ గా ప్రొడ్యూసర్లు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు దాంట్లో తెలిసిన విషయం ఏంటంటే సంక్రాంతి కి రావాల్సిన ఈగల్ సినిమాని సంక్రాంతి నుంచి ఆ ప్రొడ్యూసర్లు తప్పించినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు ఈగల్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన రావడానికి రెడీ అవుతుంది. ఇక ఈ విషయం మీద ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమాని ఫిబ్రవరి 9 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు అని క్లారిటీ ఇచ్చాడు. అందుకోసం ఆ రోజు రిలీజ్ కి రెడీ అవుతున్న డిజే టిల్లు 2, యాత్ర2 సినిమాల ప్రొడ్యూసర్స్ ని కనుక్కొని వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు అని చెప్పడంతో ఈగల్ సినిమాని ఫిబ్రవరి 9 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు అని చెప్పాడు. ఇక దాంతో సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు మాత్రమే నిలిచాయి. అందులో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా, హనుమాన్ సినిమాలు ఉన్నాయి. ఇక ఈ నాలుగు సినిమాల మీద ప్రేక్షకులకి మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే వీటికి తగ్గట్టుగానే ఈ సినిమాలు కూడా విజయం సాధించాలనే ఉద్దేశ్యం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక అందరి ఎదురుచూపు అయితే గుంటూరు కారం సినిమా మీదనే ఉంది.
ఎందుకంటే మహేష్ బాబు హీరో గా వస్తున్న సినిమా కావడంతో ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉండడం సహజం.

ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్ కావడం ఆయన ఇంతకుముందు చేసిన అలా వైకుంఠపురం లో సినిమా సూపర్ సక్సెస్ ని అందుకోవడం కూడా దీనికి ఒక కారణం గా చెప్పవచ్చు. కాబట్టి ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉండటం కామన్ అంటూ పలువురు సినీ ప్రముఖులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…చూడాలి మరి ఈ సంక్రాంతి కి ఏ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంటుందో…

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుండటం విశేషం...ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక పాట దాని తర్వాత ఎమోషనల్ సన్నివేశాలు చివరగా ఎలివేషన్ సీన్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి పెర్ఫెక్ట్ గా సెట్...

Vamshi Paidipally: వంశీ పైడిపల్లి ఆ సినిమాను రీమేక్ చేస్తున్నాడా…

Vamshi Paidipally: 'మున్నా' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీ పైడిపల్లి చాలా తక్కువ సమయం లోనే స్టార్ డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమాతో విజయాన్ని సాధించకపోయిన ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన బృందావనం, రామ్ చరణ్ తో చేసిన ఎవడు, నాగార్జునతో ఊపిరి సినిమాలను చేశాడు. మహేష్ బాబుతో...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.