India: నడిచే కాలమే వర్తమానం.. ముందు ఉండేది భవిష్యత్తు.. గడిచిన సమయమే భూత కాలం.. అందులో నీ జ్ఞాపకాలు పదిలం అంటాడు ఓ కవి. ఆ జ్ఞాపకాలే మనిషి జీవితానికి ఒక ఆలంబన. ఒక ఆచ్చాదన. అలాంటి జ్ఞాపకాలే చరిత్రను కళ్ళ ముందు నిలబెడుతున్నాయి. గతంలో ఉన్న పరిస్థితులను నేటి తరానికి తెలియజేస్తున్నాయి. అలాంటి చరిత్రే ప్రస్తుత వర్తమానాన్ని నిర్దేశిస్తోంది. భవిష్యత్తుకు ఓ దిశను చూపిస్తోంది. సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తర్వాత ఒకప్పటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటి వల్ల ప్రస్తుత తరానికి నాటి సంగతులు తెలుస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ ఆ ఫోటో ఏంటంటే..
1901 లో భారత్ లో(అప్పటికే ఇంకా పాకిస్తాన్ ఏర్పడలేదు) కొందరు వర్తకులు లాహోర్ ప్రాంతంలో మామిడి పండ్లు అమ్మేవారు. ఆ ప్రాంతంలో సారవంతమైన నేలలు ఉండటంతో మామిడి తోటలు విస్తారంగా సాగవయ్యేవి. అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి అయ్యేవి. ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పటికీ కొంతమంది ధైర్యంగా ముందుకు వచ్చి మామిడి పండ్లను అమ్మేవారు. అయితే ఆ పండ్లు అమ్మినందుకు ఆంగ్లేయులు వారి వద్ద నుంచి శిస్తు వసూలు చేసేవారట.. అయితే అప్పట్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం లేదు. కానీ కొందరు ఔత్సాహికులు ఫోటోలు తీశారు. ప్రస్తుతం వాటిని ఎవరు పోస్ట్ చేశారు తెలియదు కానీ అవి సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కోడుతున్నాయి. నెత్తికి తలపాగ చుట్టుకుని, ఒక పూరి గుడిసె లో మామిడికాయలను నిల్వచేసి.. పక్వానికి వచ్చిన కాయలను చిన్నపాటి వెదురు కర్రల మీద అమ్ముతున్న దృశ్యం నాటి పరిస్థితులను కళ్ళకు కడుతోంది. ఆ మామిడికాయలు కూడా పూర్తి నాటువి కావడంతో మామూలు సైజులోనే కనిపిస్తున్నాయి. అంటే అప్పటికి హైబ్రిడ్ మామిడి మొక్కలు ఆవిష్కరణ లోకి రాలేదని తెలుస్తోంది.
అయితే ఈ ఫోటోను చూసిన కొంతమంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అవి చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి.. మామిడికాయలు కాదని.. ఆలుగడ్డలని అంటున్నారు. అప్పట్లో లాహోర్ ప్రాంతంలో మామిడి తోటలు అంతగా లేవని.. అలాంటప్పుడు మామిడి కాయలు ఈ స్థాయిలో పండటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు నాడు బ్రిటిష్ కాలంలో వారు చెప్పిన పంటలను రైతులు సాగు చేసేవారని.. ఈ మామిడికాయలను వారు అంతగా ఇష్టపడేవారు కాదని.. అలాంటప్పుడు లాహోర్ ప్రాంతంలో ఇంత విస్తారంగా మామిడి తోటలు ఎలా సాగవుతాయని వారు అంటున్నారు. సరే ఈ వాదనలు అలా పక్కన పెడితే నాడు లాహోర్ ప్రాంతంలో రైతుల విక్రయిస్తున్న మామిడికాయలకు సంబంధించిన ఫోటో మాత్రం నెటిజన్ల ను తెగ ఆకర్షిస్తోంది.