https://oktelugu.com/

Dragon : ఓటీటీలో ‘డ్రాగన్’ సునామీ..13 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయంటే!

Dragon : ఇటీవలే చిన్న సినిమాగా విడుదలై అటు తమిళంలోనూ, ఇటు తెలుగు లోనూ సెన్సేషనల్ హిట్ గా నిల్చిన చిత్రం 'డ్రాగన్'(Dragon Movie).

Written By: , Updated On : March 21, 2025 / 05:22 PM IST
Dragon

Dragon

Follow us on

Dragon : ఇటీవలే చిన్న సినిమాగా విడుదలై అటు తమిళంలోనూ, ఇటు తెలుగు లోనూ సెన్సేషనల్ హిట్ గా నిల్చిన చిత్రం ‘డ్రాగన్'(Dragon Movie). ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా దాదాపుగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూనే ఉంది. అయితే థియేటర్స్ లో ఉండగానే ఈ చిత్రాన్ని నిన్న అర్థ రాత్రి నుండి నెట్ ఫ్లిక్స్(Netflix) లో స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. ఓటీటీ ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రెస్పాన్స్ కూడా వచ్చింది. విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కేవలం 13 గంటల్లోనే 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయట. ఇది చిన్న విషయం కాదు. అనేక సూపర్ హిట్ సినిమాలకు వారం రోజులు గడిస్తే కానీ రెండు మిలియన్ వ్యూస్ రావడం కష్టం అవుతుంది .

Also Read : బంపర్ ఛాన్స్ కొట్టేసిన ‘డ్రాగన్’ హీరోయిన్..ఇక స్టార్ అయిపోయినట్టే!

అలాంటిది ఈ సినిమాకు కేవలం 13 గంటల్లోనే ఈ రేంజ్ వ్యూస్ వచ్చాయంటే కచ్చితంగా ఓటీటీ లో ఈ చిత్రం రాబోయే రోజుల్లో సెన్సేషన్ సృష్టించబోతోంది అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఊపు చూస్తుంటే కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమాకు 15 లక్షల వ్యూస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మిగిలిన ఓటీటీ సంస్థల్లో రెస్పాన్స్ ని దక్కించుకోవడం వేరు, నెట్ ఫ్లిక్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకోవడం వేరు. ఇక్కడ ఒక సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే నెలల తరబడి ట్రెండ్ అవుతూనే ఉంటుంది. గ్లోబల్ వైడ్ గా అద్భుతమైన రీచ్ వస్తూ ఉంటుంది. గత ఏడాది నవంబర్ నెలలో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఇప్పటికీ నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 లో ట్రెండ్ అవుతూనే ఉంది. అంటే దాదాపుగా 16 వారాలు ట్రెండ్ అయ్యింది అన్నమాట.

‘డ్రాగన్’ కి కూడా ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) కొత్త హీరో కాబట్టి కేవలం 150 కోట్లు మాత్రమే వచ్చింది. అదే ధనుష్ తరహా హీరో ఈ సినిమాని చేసుంటే కచ్చితంగా 400 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేదని విశ్లేషకుల అభిప్రాయం. ఓటీటీ లో చిన్న పెద్ద అనే తేడా లేదు. ఏ హీరో సినిమాని అయినా అందరూ చూస్తారు కాబట్టి, ఈ సినిమాకు కచ్చితంగా ఓటీటీ లో ‘లక్కీ భాస్కర్’ ని మించిన రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అమితంగా ఇష్టపడే కథ కావడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అనొచ్చు. ఎవరైనా థియేటర్స్ లో మిస్ అయ్యుంటే, మర్చిపోకుండా ఓటీటీ లో చూడండి. ప్రారంభం నుండి ఎండింగ్ వరకు అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ ని ఇవ్వగల చిత్రమిది. అయ్యో థియేటర్స్ లో ఇలాంటి సినిమాని మిస్ అయ్యామే అని చూడని వాళ్ళు బాధపడతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Also Read : ఓటీటీ లోకి ‘డ్రాగన్’ ఎంట్రీ..ఎప్పటి నుండి చూడొచ్చంటే!