Dragon
Dragon : ఈమధ్య కాలం లో మన సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా కొత్త హీరోయిన్స్ కి అవకాశాలు వస్తున్నాయి. కొత్త హీరోయిన్స్ దాటికి అప్పటి వరకు ట్రెండింగ్ ఉంటున్న స్టార్ హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయిపోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదేమో. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వాళ్లంతా స్టార్ హీరోయిన్ రేంజ్ లో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఆ జాబితా లోకి డ్రాగన్ మూవీ(Dragan Movie) హీరోయిన్ కాయదు లోహార్(Kayadu Lohar) కూడా చేరిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రమిది. ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తో పాటు కాయాధు లోహార్ కూడా నటించింది.
Also Read : ఓటీటీ లోకి ‘డ్రాగన్’ ఎంట్రీ..ఎప్పటి నుండి చూడొచ్చంటే!
సాధారణంగా యూత్ ఆడియన్స్ లో అనుపమ పరమేశ్వరన్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఆమెని చూడడం కోసమే థియేటర్స్ కి వెళ్తుంటారు. కానీ ‘డ్రాగన్’ చిత్రంలో మాత్రం ఆ స్థానం కాయదు లోహర్ కొట్టేసింది. ఈ సినిమా విడుదలకు ముందు ఒక మూవీ టీం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కాయదు లోహర్ కొన్ని మీమ్స్ తనకు తానే క్రియేట్ చేసుకొని మీమర్స్ కి టాలీవుడ్ లో రాబోయే కాలానికి కాబోయే సూపర్ స్టార్ అని డబ్బా కొట్టించుకుంది అంటూ హీరో ప్రదీప్ రంగనాథన్ ఆ ఇంటర్వ్యూ లో ఆటపట్టిస్తాడు. కానీ ఆమె మీమ్ లో పెట్టిన వ్యాఖ్యలు త్వరలోనే నిజమయ్యేలా ఉంది. రీసెంట్ గానే ఆమెకు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటిస్తున్న ‘జైలర్ 2’ లో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది అట.
త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాపై సౌత్ ఇండియా లో ఎలాంటి క్రేజ్, హైప్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో ఆమెకు నటించే అవకాశం రావడం ఇంత తక్కువ సమయంలో రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే రెండేళ్లలో ఈమె తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ క్షణకాలం తీరిక లేకుండా గడపబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు లో ఈమె మొట్టమొదటిసారి శ్రీవిష్ణు హీరోగా నటించిన అల్లూరి చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమైంది. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో కాయాధు అప్పట్లో హైలైట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం యూత్ ఐకాన్ గా మారిపోయింది.
Also Read : అక్షరాలా 150 కోట్లు..చరిత్ర సృష్టించిన ‘డ్రాగన్’..23 వ రోజు ఎంత వసూళ్లు వచ్చిందో తెలుసా?