Chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి లండన్ పార్లమెంట్ లో గౌరవ సివిలియన్ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. లండన్ పార్లమెంట్ లో ఇలాంటి గౌరవ పురస్కారం అందుకున్న మొట్టమొదటి భారతీయుడు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ విషయం ఇది. సినిమాల్లో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోగించిన మెగాస్టార్, సామజిక సేవల్లో కూడా అదే కోట్లాది మందిని ప్రభావితం చేశాడు. ఆయన మాత్రమే సేవ చేయడం కాకుండా, ప్రపంచ నలుమూలల్లో ఉండే తన అభిమానులను కూడా సేవ చేయించేలా ప్రేరేపించాడు. అలాంటి మెగాస్టార్ కి లండన్ లో అభిమానుల నుండి ఎదురైన ఒక సంఘటన ఆయన్ని తీవ్రమైన నిరాశకు గురి అయ్యేలా చేసింది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఆయన వేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.
Also Read : చిరంజీవి సూపర్ హిట్ సినిమాలను చూస్తున్న అనిల్ రావిపూడి…కారణం ఏంటంటే..?
ఆయన మాట్లాడుతూ ‘ప్రియమైన అభిమానులారా, నా లండన్ పర్యటనలో నన్ను కలవాలని మీరు చూపుతున్న ఉత్సాహం, ప్రేమ, ఆప్యాయత నన్ను ఎంతగానో కదిలించింది. మీ అభిమానం వెలకట్టలేనిది. అయితే కొంతమంది వ్యక్తులు మీ అభిమానం ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నాతో కలిసి ఫోటో దింపిస్తాను అని చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని నాకు సమాచారం అందింది. ఇలాంటి చర్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎవరైనా ఇలా చేసి ఉంటే మీ డబ్బులు వెంటనే రిటర్న్ ఇవ్వబడుతుంది. మీకు నాకు మధ్య ఉన్న రిలేషన్ వెలకట్టలేనిది. దానిని ఎవ్వరూ కూడా ఇలా వ్యాపారం కోసం వాడుకోకూడదు. దయచేసి అప్రమత్తంగా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకు ఇలాంటి చర్యలకు పాల్పడిన ఆ వ్యక్తి ఎవరు ఏమిటి అనేది మెగాస్టార్ బయటపెట్టలేదు. కానీ సోషల్ మీడియా లో అభిమానులు మాత్రం ఈ అంశం పై ఫైర్ మీద ఉన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర మూవీ(Viswambhara Movie) షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి అయ్యింది కానీ, VFX వర్క్ ఇంకా కాస్త పెండింగ్ లో ఉందట. కేవలం చిరంజీవి కి సంబంధించి 10 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మొదట్లో ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం వాయిదా వేశారు. కనీసం మే నెలలో అయిన విడుదల అవుతుందని అనుకుంటే, అది కూడా జరగడం లేదు. ఇక మిగిలింది సెప్టెంబర్ నెల మాత్రమే. అప్పుడు కూడా మిస్ అయితే ఇక సంక్రాంతికి చూసుకోవడమే. సంక్రాంతికి అయితే చిరంజీవి అనిల్ రావిపూడి(Anil Ravipudi) తో చేయబోతున్న సినిమా కూడా రెడీ అయిపోతుంది. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది ముందు విడుదల అవుతుందో చూడాలి.
Also Read : చిరంజీవి లైనప్ చూస్తే మెంటలెక్కిపోతారు..రామ్ చరణ్ కూడా వెనకబడ్డాడుగా!