Katrina Kaif , Salman Khan
Katrina Kaif : పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కత్రినా కైఫ్(Katrina Kaif) కచ్చితంగా ఉంటుంది. ఈమె సినిమాల్లోకి వచ్చింది మన తెలుగు సినిమా ద్వారానే. విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ఆల్ టైం క్లాసిక్ చిత్రం ‘మల్లీశ్వరి’ ద్వారా హీరోయిన్ గా వెండితెర అరగేంట్రం చేసిన కత్రినా కైఫ్, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో వెంటనే బాలయ్య బాబు తో కలిసి ‘అల్లరి పిడుగు’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా కత్రినా కైఫ్ కి టాలీవుడ్ లో అవకాశాలు రావడం ఆగలేదు. కానీ ఆమె మాత్రం బాలీవుడ్ వైపే ఎక్కువ మొగ్గు చూపించింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లో దాదాపుగా అందరి సూపర్ స్టార్స్ తో కలిసి నటించింది.
Also Read : విడాకుల బాట పట్టిన కత్రినా కైఫ్..? అర్థరాత్రి ఏడ్చుకుంటూ ఇల్లు వదిలి వెళ్లిపోయిన కత్రినా!
ఇదంతా పక్కన పెడితే ఒకప్పుడు ఈమె సల్మాన్ ఖాన్(Salman Khan) తో డేటింగ్ చేసింది అనే విషయం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. అతని ఫ్లాట్ లోనే రెండు మూడేళ్ళ వరకు కత్రినా కైఫ్ ఉన్నింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళ మధ్య బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళు సోలో లైఫ్ ని ఎంజాయ్ చేసిన కత్రినా రణబీర్ కపూర్ తో డేటింగ్ చేసింది. చివరికి అతనితో కూడా బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన కత్రినా కైఫ్ 2021 వ సంవత్సరం లో ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) ని ప్రేమించి పెళ్లాడింది. విక్కీ కౌశల్ అంటే మరెవరో కాదు, రీసెంట్ గా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ‘చావా’ మూవీ హీరో. వీళ్ళ పెళ్లి జరిగి సరిగ్గా మూడేళ్లు అయ్యింది.
ఇది ఇలా ఉండగా కత్రినా కైఫ్ మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ రీసెంట్ గా సికిందర్ మూవీ ప్రొమోషన్స్ లో కత్రినా కైఫ్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఒక రిపోర్టర్ ‘కత్రినా కైఫ్ తో కలిసి మళ్ళీ నటిస్తారా’ అని అడగగా, దానికి ఆయన సమాధానం ఇస్తూ ‘ఆమె విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకొని జీవితం లో స్థిరపడిపోయింది. వాళ్లిద్దరూ కలిసి పిల్లల్ని కంటే చూడాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా లో కత్రినా కైఫ్ పిల్లల్ని కనడం పై పెద్ద చర్చ మొదలైంది. పెళ్ళై మూడేళ్లు గడుస్తున్నా ఇంకా పిల్లల్ని కనకపోవడం ఏమిటి?, ఏడాది క్రితం పెళ్ళైన సెలబ్రిటీస్ కూడా పిల్లల్ని కనేసారు. అసలు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కలిసి ఉంటున్నారా లేదా అని అంటున్నారు నెటిజెన్స్. సోషల్ మీడియాలో ఈ అంశంపై ట్రోల్స్ తార స్థాయిలో ఉన్నాయి.
Also Read : మా ఆవిడ సైంటిస్ట్ లెక్క.. ఎంత తెలివో..: మురిసిపోతున్న స్టార్ హీరో..