spot_img
Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer: పెళ్లి కాని సుడిగాలి సుధీర్ కి అంత పెద్ద కూతురు ఉందా... ఇదేం...

Sudigali Sudheer: పెళ్లి కాని సుడిగాలి సుధీర్ కి అంత పెద్ద కూతురు ఉందా… ఇదేం ట్విస్ట్ సామీ!

Sudigali Sudheer: ఇటు స్మాల్ స్క్రీన్ అటు సిల్వర్ స్క్రీన్… రెండు చోట్ల రాణిస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఆ మధ్య యాంకరింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చినా… రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే సుడిగాలి సుధీర్ గుర్తుకు వస్తాడు. తన బెస్ట్ ఫ్రెండ్స్ ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు పిల్లలు కూడా ఉన్నారు. సుడిగాలి సుధీర్ మాత్రం బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ సుధీర్ పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అతనికి ఒక కూతురు కూడా ఉందట. అసలు సుధీర్ ఎలా తండ్రి అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే .. సుధీర్ గతంలో యాంకర్ విష్ణు ప్రియతో(Vishnu Priya) కలిసి పోవే పోరా అనే షో చేశాడు. ఈ యూత్ఫుల్ షోలో కాలేజీ స్టూడెంట్స్ తో సుధీర్ – విష్ణు ప్రియ సరదాగా గేమ్స్ ఆడించేవారు. పోవే పోరా షో చేస్తున్న సమయంలో సుధీర్ – విష్ణు ప్రియ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. విష్ణు ప్రియకు తండ్రి లేడు. దీంతో సుధీర్ ఆమెను చాలా ఆప్యాయంగా చూసుకునేవాడు.

Also Read: Sudigali Sudheer: నువ్వు బుల్లి తెరకి మారాజువి ! వెండితెర వద్దు, ఇక్కడే ఉండిపో సుధీరన్నా !

విష్ణు ప్రియ మంచి చెడుల గురించి ఆలోచించేవాడు. ఈ క్రమంలో సుధీర్ ను తన తండ్రిగా భావిస్తానని విష్ణుప్రియ ఓ సందర్భంలో చెప్పింది. అంతేకాదు సుధీర్ డాడీ అని కూడా పిలుస్తానని ఆమె తెలిపింది. తన తండ్రి తర్వాత .. తనను అంత ప్రేమగా చూసుకున్న మొదటి వ్యక్తి సుధీర్ అని చెప్పింది. ప్రతి రోజు తిన్నానో, లేదో అడిగే మొదటి వ్యక్తి అతనే అని తెలిపింది.

Also Read: Sudigali Sudheer: ఏంటి మీ బావలో అంత మేటర్ ఉందా? సుడిగాలి సుధీర్ షోలో యంగ్ యాంకర్స్ హాట్ కామెంట్స్

తనతో పని చేసినంత కాలం చాలా బాగా చూసుకున్నాడని, ఇప్పటికి కూడా తమ స్నేహం కొనసాగుతుందని వివరించింది. ఆ విధంగా విష్ణుప్రియకు సుధీర్ తండ్రి అయ్యాడు. అంతే కానీ నిజంగా ఆయనకు కూతురు లేదు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ గోట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు యాంకర్ గా మారి పలు షోలు చేస్తున్నాడు. ఆహాలో సర్కార్ సీజన్ 4(Sarkar season 4) హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఫ్యామిలీ స్టార్స్ అనే షోతో ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు.

Exit mobile version