https://oktelugu.com/

Sudigali Sudheer: నువ్వు బుల్లి తెరకి మారాజువి ! వెండితెర వద్దు, ఇక్కడే ఉండిపో సుధీరన్నా !

Sudigali Sudheer: రష్మీ గౌతమ్ తో సుధీర్ లవ్ ట్రాక్ మరొక ఆకర్షణ. వీరిద్దరి కెమిస్ట్రీని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. రెండుసార్లు మల్లెమాల సంస్థ వీరికి పెళ్లి చేసింది. సుధీర్-రష్మీ నిజమైన ప్రేమికులు అని నమ్మే అభిమానులు లేకపోలేదు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 28, 2024 / 10:24 AM IST

    No silver screen, stay here Sudigali Sudheer

    Follow us on

    Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ అంటే… బుల్లితెర పై ఒక బ్రాండ్ నేమ్. జబర్దస్త్(Jabardasth) వేదికగా వెలుగులోకి వచ్చిన స్టార్స్ లో సుడిగాలి సుధీర్ ఒకరు. తనదైన కామెడీ స్టైల్, ఎక్స్ప్రెషన్స్ సుడిగాలి సుధీర్ ని ప్రత్యేకంగా మార్చాయి. తన మల్టీటాలెంట్స్ తో ఆయన బుల్లితెర స్టార్ గా ఎదిగారు. జబర్దస్త్ ప్రేక్షకులు సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్స్ కోసం ఎదురు చూసేవారు. మిత్రులు ఆటో రామ్ ప్రసాద్(Ram Prasad), గెటప్ శ్రీనుతో(Getup Srinu) ఆయన సంచలనాలు సృష్టించాడు. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో డాన్స్ రియాలిటీ షో ఢీకి వెళ్ళాడు. ఢీ యాంకర్ గా సుడిగాలి సుధీర్ మరింత క్రేజ్ రాబట్టారు.

    ఢీ డాన్స్ రియాలిటీ షోలో తన డాన్సులతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. సుడిగాలి సుధీర్ డాన్స్ లో గ్రేస్ ఉంటుంది. ఆయన మంచి సింగర్ కూడాను. ప్రొఫెషనల్ మెజీషియన్. వెరసి సుడిగాలి సుధీర్ అంటే ఆడియన్స్ కి ఒక ఎంటర్టైనర్. స్క్రీన్ పై ఆయన కనిపిస్తే ఒక ఉత్సాహం. జబర్దస్త్, ఢీ రియాలిటీ షోల టీఆర్సీని పరుగులు పెట్టించాడు. బుల్లితెర మీద సుడిగాలి సుధీర్ వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే.

    రష్మీ గౌతమ్ తో సుధీర్ లవ్ ట్రాక్ మరొక ఆకర్షణ. వీరిద్దరి కెమిస్ట్రీని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. రెండుసార్లు మల్లెమాల సంస్థ వీరికి పెళ్లి చేసింది. సుధీర్-రష్మీ నిజమైన ప్రేమికులు అని నమ్మే అభిమానులు లేకపోలేదు. అయితే ఇదంతా గతం. సుడిగాలి సుధీర్ జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీకి దూరం అయ్యాక ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గింది అనేది నిజం.

    హీరో కావాలనే భ్రమలో సుధీర్ వాస్తవాన్ని మరిచాడేమో అనిపిస్తుంది. ఎవరైనా అంచెలంచెలుగా ఎదగాలి అనుకుంటారు. అందులో ఎలాంటి తప్పు లేదు. అదే సమయంలో నేల విడిచి సాము చేయడం సరికాదు. సుడిగాలి సుధీర్ బలం కామెడీ. ఆయన ఎంచుకునే జానర్ కామెడీ అయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆయన మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. గాలోడు మూవీతో ఓ మోస్తరు హిట్ కొట్టినా… కాలింగ్ సహస్ర దెబ్బతీసింది.

    నెక్స్ట్ సుధీర్ చేస్తున్న గోట్ సైతం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. స్టార్ హీరోల వారసులు కూడా మాస్ హీరోలుగా ఎదగడం అలవి కాని అంశం. అలాంటిది ఒక మాజీ జబర్దస్త్ కమెడియన్ మాస్ హీరో ఇమేజ్ కోరుకోవడం కలే అవుతుంది. నటుడు సునీల్ ఇందుకు ఉదాహరణ. కమెడియన్ ఇమేజ్ ఉన్న సునీల్ ఆ జోనర్లో హీరోగా సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. యాక్షన్ ఎంటర్టైనర్స్ జోలికి పోయాకే ఫ్లేటు తిరగబడింది.

    Also Read: Sudigali Sudheer: ఏంటి మీ బావలో అంత మేటర్ ఉందా? సుడిగాలి సుధీర్ షోలో యంగ్ యాంకర్స్ హాట్ కామెంట్స్

    సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ కావాలంటే మన ఇమేజ్ కి సెట్ అయ్యే మంచి కథలు ఎంచుకోవాలి. నటుడు సుహాస్ ఈ విషయంలో భేష్ అనిపిస్తున్నాడు. పలువురు నటులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కలర్ ఫోటో తో హీరోగా మారిన సుహాస్ కి మంచి ఆరంభం లభించింది. అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం వంటి విజయాలతో సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతున్నాడు.

    సుధీర్ కి వాస్తవం బోధపడిన సూచనలు కనిపిస్తున్నాయి. తిరిగి యాంకర్ గా బిజీ అవుతున్నాడు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో సర్కార్ పేరుతో గేమ్ షో చేస్తున్నాడు. సర్కార్ సీజన్ 4లో సుధీర్ యాంకరింగ్ హైలెట్ గా నిలుస్తుంది. ఈటీవీలో ఫ్యామిలీ స్టార్ పేరుతో మరో గేమ్ షో స్టార్ట్ చేశాడు. దీంతో సుధీర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదయ్యా నీ బలం… బుల్లితెర యాంకర్ గా కొనసాగుతూ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నారు.

    Also Read: Sudigali Sudheer : నీ కరువు పాడుగాను, ఆడ దెయ్యాన్ని కూడా వదలవా… సుడిగాలి సుధీర్ ఇంత గాలోడా!