Oily Nose: జిడ్డు ముక్కుతో బాధ పడుతున్నారా? అయితే ఇదిగో పరిష్కారం

ముక్కుపై జిడ్డు సమస్యకు చెక్‌ పెట్టడానికి సరైన ఫేస్‌వాష్‌ ను ఎంపిక చేసుకోవాలి. ముక్కు మీద నూనె ఉంటే ఇది తీసేస్తుంది. మరీ ముఖ్యంగా యాండీ ఆక్సిడెంట్స్‌ ఉండే గ్రీన్‌ టీ ఫేస్‌ వాష్ ను ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుంది.

Written By: Swathi, Updated On : May 30, 2024 2:06 pm

Oily Nose

Follow us on

Oily Nose: జిడ్డు ముక్కు చాలా మందిని వేధిస్తుంటుంది. ఇక మహిళలకు అయితే మరింత ఎక్కువ ఉంటుంది. వాతావరణంతో సంబంధం లేకుండానే కొందరికి ముక్కు జిడ్డుగా అవుతుంది.ముఖం బాగుండి ముక్కు జిడ్డుగా ఉంటే బాగుండదు కదా.మరి దీని కోసం క్రీములు వాడుతున్నారా? వీటివల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండే అవకాశాలు లేకపోలేదు. అందుకే కొన్ని సూపర్ టిప్స్ పాటించండి.

ముక్కుపై జిడ్డు సమస్యకు చెక్‌ పెట్టడానికి సరైన ఫేస్‌వాష్‌ ను ఎంపిక చేసుకోవాలి. ముక్కు మీద నూనె ఉంటే ఇది తీసేస్తుంది. మరీ ముఖ్యంగా యాండీ ఆక్సిడెంట్స్‌ ఉండే గ్రీన్‌ టీ ఫేస్‌ వాష్ ను ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుంది. జిడ్డు ముక్కుతో ఇబ్బందిపడేవారు మాయిశ్చరైజర్‌ను వాడటం మంచిది. జిడ్డు ముక్కుతో ఇబ్బంది పడే వారు జెల్‌ బేస్డ్‌ మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి అంటున్నారు నిపుణులు. ఎండ కారణంగా కూడా ముక్కు జిడ్డుగా మారే సమస్య వస్తుందట. మీకు కూడా ఈ సమస్య ఉంటే సన్‌స్క్రీన్‌ను వాడటం మంచిది. మ్యాట్‌ఫైయింగ్‌ సన్‌స్క్రీన్‌ను రాసుకుంటే మరింత మంచిది.

డీహైడ్రేషన్‌ కారణంగా కూడా ముక్కు జిడ్డుగా మారుతుంది. కాబట్టి ప్రతీరోజూ కచ్చితంగా తగినంత నీరు తాగాలి.. వర్షంకాలం, చలికాలం అనే సంబంధం లేకుండా నీరు తీసుకోవడం మంచిది. పదేపదే ముఖాన్ని కడుక్కుంటే కూడా ఈ సమస్య వస్తుందట. తరచుగా ముఖం కడిగితే స్కిన్‌డ్రై సమస్య వస్తుంది.

ఆల్కహాల్‌, కెఫిన్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది అంటున్నారు నిపుణులు. అయితే సేబాషియస్‌ గ్రంథులు ఎక్కువగా నూనెను ఉత్పత్తి చేస్తాయట. ముక్కుపై తేనెను రాసి 10 నుంచి 15 నిమిషాల పాటు మసాజ్‌ చేసుకోవాలి. తేనెలోని యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఈ సమస్యకు చెక్ పట్టడంలో చాలా ఉత్తమంగా పని చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే గంధం కూడా జిడ్డు ముక్కుకు చెక్ పెడుతుంది. ఇందుకోసం కొంత గంధాన్ని తీసుకొని అందులో పాలు లేదా నీళ్లు కలిపి ముక్కుకు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రంగా చేసుకోవాలి.