https://oktelugu.com/

Sudigali Sudheer: ఏంటి మీ బావలో అంత మేటర్ ఉందా? సుడిగాలి సుధీర్ షోలో యంగ్ యాంకర్స్ హాట్ కామెంట్స్

సుడిగాలి సుధీర్ పై బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి మనసు పారేసుకుంది. ఆయన్ని తెగ ప్రేమించేస్తుంది అని తెలుస్తుంది. అయితే త్వరలో సుధీర్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ మొదటి ఎపిసోడ్ రాబోతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 25, 2024 / 01:18 PM IST

    Young anchors sensational comments on Sudhir Sudheer show

    Follow us on

    Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్, ఢీ షోల వేదికగా బుల్లితెరపై సెన్సేషన్ సృష్టించాడు. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నాడు. ఆ ఫేమ్ తో హీరోగా మారిన సుధీర్ పూర్తిగా టీవీ ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. కాగా సుధీర్ ఈటీవీలో గ్రాండ్ రీఎంట్రీకి సిద్ధం అవుతున్నాడు. ఫ్యామిలీ స్టార్ పేరుతో సరికొత్త షో తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాడు.

    ఇది ఇలా ఉంటే .. సుడిగాలి సుధీర్ పై బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి మనసు పారేసుకుంది. ఆయన్ని తెగ ప్రేమించేస్తుంది అని తెలుస్తుంది. అయితే త్వరలో సుధీర్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ మొదటి ఎపిసోడ్ రాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. మాస్ ఎంట్రీతో సుధీర్ అదరగొట్టాడు. కొందరు బుల్లితెర సెలెబ్రెటీలు హాజరయ్యారు. వాళ్ళతో పాటు అషురెడ్డి, యాంకర్ స్రవంతి మరో యాంకర్ కూడా ఉన్నారు.

    ఈ క్రమంలో అషు రెడ్డి సుధీర్ పై తనకున్న ప్రేమను బయటపెట్టింది. ఇన్ డైరెక్ట్ గా మనుసులో ఉన్న మాట చెప్పేసింది. సుధీర్ ని బావా అని పిలిచి షాకిచ్చింది. స్టేజ్ పై అందరి ముందు సుధీర్ బావ అంటూ ఏదో చెప్పింది. ముఖ్యంగా స్రవంతి కి తన పక్కన ఉన్న మరో అమ్మాయికి అషు వార్నింగ్ ఇచ్చింది. మీ ఇద్దరూ మా సుధీర్ బావ జోలికి రావొద్దు. సుధీర్ బావని చూసి టెంప్ట్ అవ్వద్దు అని అషు చెప్పింది.

    ఏంటి మీ సుధీర్ బావలో అంత మ్యాటర్ ఉందా అంటూ… స్రవంతి కౌంటర్లు ఇచ్చింది. కాగా షోలో భాగంగా అషు రెడ్డి, సుధీర్ ని బావ అంటూ అతని చుట్టూ తిరుగుతూ ఎంటర్టైన్ చేసింది. అయితే యాంకర్స్ మధ్య సంభాషణ ఒకింత హద్దులు దాటేసింది. కాగా ఈ ఎపిసోడ్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం కానుంది. చాలా కాలం తర్వాత అషు రెడ్డి బుల్లితెర పై కనిపించి తన ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం అషు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ ఇప్పుడిప్పుడే మళ్లీ ఫార్మ్ లోకి వస్తుంది.