Tollywood Richest Hero: ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లీగ్ లో ఉన్న హీరోల రెమ్యూనరేషన్ వింటే మతిపోవాల్సిందే, ఒక్కో హీరో దాదాపు 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ బాలీవుడ్ హీరోలకు సవాల్ విసిరే స్థాయికి చేరుకున్నారు. పాన్ ఇండియా అప్పీరియన్స్ ఉన్న బాలీవుడ్ లో కూడా ఐదారుగురు స్టార్ హీరోలు మాత్రమే 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే మన టాలీవుడ్ లో దాదాపు అంతే మంది స్టార్ హీరోలు 100 కోట్ల వరకూ తీసుకుంటున్నారు. ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన రూ. 150 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం.
ఇలా వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న సమయంలో వాళ్ళ ఆస్తులు ఏమిటో టాలీవుడ్ లో ఏ హీరోకి ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్నాయో తెలుసుకోవాలి అనే కుతూహలం అందరికీ ఉంటుంది. అయితే ఇక్కడ గమ్మతైన విషయం ఏమిటంటే ఇప్పుడు వందల కోట్లు తీసుకుంటూ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు చేస్తున్న హీరోలు ఎవరు కూడా నెంబర్ వన్ పొజిషన్ లో లేరు. అవును మీరు విన్నది నిజమే. సినిమాకు రూ. 10 నుంచి 15 కోట్లు తీసుకునే అక్కినేని నాగార్జున టాలీవుడ్ హీరోల్లో అత్యంత ధనవంతుడు..
అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని కొనసాగిస్తూ, టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్న నాగార్జున ఇటు హీరోగా అటు నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియో అధినేతగా, మరికొన్ని రియాలిటీ షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బాగా సంపాదిస్తున్నాడు. అదే సమయంలో బిజినెస్లు చేస్తున్న ఈ సీనియర్ హీరో ఆస్తులు దాదాపు మూడు వేల కోట్ల పైమాటే అని సమాచారం. హోటల్, మీడియా రంగాల్లో నాగార్జున పెట్టుబడులు పెట్టారు.
ఇక నాగార్జున తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి వచ్చి స్టార్ గా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. ఆయన ఆస్తులు సుమారు 1700 కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది. గతంలో నాగార్జున, చిరంజీవి కలిసి కొన్ని ఉమ్మడి వ్యాపారాలు కూడా నిర్వహించారు. ఇక వాళ్ళ తర్వాత మూడో స్థానంలో మెగా వారసుడు రామ్ చరణ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన ఆస్తులు, వాళ్ళ ఆవిడా ఉపాసన ఆస్తులు కలిసి దాదాపు 1400 కోట్లు దాకా ఉండవచ్చని తెలుస్తోంది. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన చెర్రీ ఆస్తులు భారీగా పెరిగే అవకాశం లేకపోలేదు.ఇక వీరి తర్వాతి స్థానాల్లో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More