Balakrishna: పొగ తాగనివాడు దున్నపోతై పుట్టును అన్నాడు గిరీషం. కానీ మద్యం తాగని వాడు అసలు మనిషే కాదంటున్నాడు ఆధునిక గిరీషం. ఇప్పుడు పార్టీలు పబ్బులు, సరదాలు అనేది ఫ్యాషన్ గా మారింది. ఎంజాయ్ మెంట్ ఓ లెవల్లో ఉంటుంది. అసలు సినీ ఇండస్ట్రీలో ఈ చుక్కవేసే వారు చాలా మంది ఉంటారు. సాయంత్రం అవ్వగానే పెగ్గువేయనిదే పూట గడవని వారు ఉండరు. అదొక దినచర్యగా ఉంటోంది.

సినీ ఇండస్ట్రీలో చాలా మందికి మద్యం ఒక అలవాటుగా ఉంది. ఆ విషయం చాలా మందికి తెలుసు. అది పూర్తిగా వ్యక్తిగత విషయం. అయినా కూడా కొందరు ఓపెన్ గానే చెబుతుంటారు. ఇటీవల ‘మా’ ఎన్నికల సందర్భంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వర్గాలు సినీ ప్రముఖులకు పెద్ద మందు పార్టీలిచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మద్యం తాగుతాం.. అది కూడా ఏ బ్రాండ్ నో అనేది టాలీవుడ్ అగ్రనటులు బాలక్రిష్ణ, మోహన్ బాబులు బయటపెట్టారు.
నేను మందు తాగుతానన్న విషయం సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అని బాలయ్య హాట్ కామెంట్ చేశాడు. నేను ‘మేన్సన్ హౌజ్’ తాగుతాను. నా ఇంట్లో పెద్ద బార్ కూడా ఉందని బాలయ్య అసలు సీక్రెట్స్ బయటపెట్టాడు. పొద్దున్న 4 గంటలకు లేచి ఎదురుగా కేబీఆర్ పార్క్ లో జాగింగ్ కు వెళతానని.. అంత పొద్దున తెరవరు కనుక గోడదూకేస్తానని బాలయ్య సీక్రెట్స్ చెప్పుకొచ్చాడు.
ఇక బాలయ్య స్ఫూర్తితో మోహన్ బాబు సీక్రెట్స్ పంచుకున్నాడు. మద్రాస్ లో సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కోడంబాకం బ్రిడ్జి కింద 25 పైసలు ఇచ్చి సారా తాగేవాడినని.. తనతోపాటు మరో హీరో అయిన స్నేహితుడు కూడా వచ్చేవాడని మోహన్ బాబు బయటపెట్టాడు. ఇప్పుడు మాత్రం ‘రాయల్’ విస్కీ తాగుతున్నానని తన మందు సీక్రెట్ ను మోహన్ బాబు రివీల్ చేశాడు.