Celebrities: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం.. యావత్ భారత చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. పునీత్ మాదిరిగానే ఆ మధ్య మరికొందరు తారలూ ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయారు. అభిమానులను అంతులేని దుఖంలో ముంచేశారు. ఇలా హఠాత్తుగా దూరమైన సినీ ప్రముఖుల వివరాలు చూద్దాం.

శ్రీహరి: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం నిలబెట్టుకున్న నటుడు శ్రీహరి. రియల్ స్టార్ గా సత్తా చాటిన ఆయన.. కేవలం 49 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచారు. తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకెళ్థున్న వేళ హఠాత్తుగా చనిపోయారు. హిందీ సినిమా రాంబో రాజ్‌కుమార్ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ఈయన.. అక్కడే అనారోగ్యానికి గురై, లీలావతి హాస్పిటల్‌లో 2013లో చనిపోయాడు. శ్రీహరి మరణం అందరినీ కలచి వేసింది.
శ్రీదేవి: తనదైన అందం, అభినయంతో.. నిజంగానే అతిలోక సుందరిలా వెండితెరపై కనిపించిన శ్రీదేవి.. 54 ఏళ్లకే కన్ను మూశారు. 2018లో అకస్మాత్తుగా చనిపోయారు. ఓ పెళ్లి వేడుకకోసం దుబాయ్ వెళ్లిన ఆమె.. ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో పడిపోయారు. ఆ సమయంలోనే హార్ట్ ఎటాక్ కూడా రావడంతో ప్రాణాలు కోల్పోయారు.
ఇర్ఫాన్ ఖాన్ : భారతీయ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన విలక్ష్ణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్.. మూడున్నర దశాబ్దాలుగా.. బాలీవుడ్ లో సత్తా చాటారు. ఎన్నో అవార్డులు దక్కించుకున్న ఆయన.. అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ తో గతేడాది తుది శ్వాస విడిచారు.
ఆర్తి అగర్వాల్: చిన్న వయసులోనే.. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరు ఆర్తి అగర్వాల్. కేవలం 31 ఏళ్లకే ఈ లోకాన్ని వదిలిపోయింది. మానసిక ఒత్తిడితో బరువు పెరిగిన ఆర్తి.. దాన్ని తగ్గించుకోవడానికి ఆపరేషన్ చేయించుకుంది. కానీ.. దురదృష్ట వశాత్తూ అది వికటించడంతో.. ప్రాణాలు కోల్పోయింది.
Also Read: Manchu Vishnu: మాట నిలబెట్టుకునే పరిస్థితి విష్ణుకు ఉందా ?
చిరంజీవి సర్జా: కన్నడ సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు చిరంజీవి సర్జా. సీనియర్ హీరో అర్జున్ కు సర్జా బంధువు. కమర్షియల్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. గతేడాది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన వయసు కేవలం 38 సంవత్సరాలే. ఇలా.. తక్కువ వయసులోనే దూరమై, అభిమాన లోకాన్ని శోకసంద్రంలో ముంచేశారు సినీ తారలు.
Also Read: RRR: ఉత్కంఠ రేపుతోన్న ఆర్ఆర్ఆర్ సెకెండ్ సింగిల్ బజ్!