https://oktelugu.com/

Nani : నాని కలను నెరవేర్చిన యంగ్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 4, 2024 / 09:19 AM IST

    Nani

    Follow us on

    Nani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. కానీ న్యాచురల్ స్టార్ నాని లాంటి నటులు మాత్రం చాలా అరుదుగా ఉన్నారనే చెప్పాలి. ఇక ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించగలిగే కెపాసిటీ ఉన్న నటులలో నాని ఒకరు. ఆయన డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక న్యాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని సైతం తన దైన రీతిలో సినిమాలను చేస్తూ భారీ రేంజ్ లో ఎలివేట్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే దసర, హాయ్ నాన్న, సరిపోదా శనివారం లాంటి మూడు వరుస సక్సెస్ లను అందుకున్న ఆయన తన తదుపరి సినిమాతో కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకునే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా ఉంటున్నాయి. ఇక సినిమా సినిమాకి ఒక డిఫరెంట్ వేరియేషన్ ను చూపిస్తూ నాని అద్భుతమైన పర్ఫామెన్స్ ను సినిమాలను చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు.

    మరి అలాంటి నాని ఇప్పుడు చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే మెగాస్టార్ చిరంజీవితో కొలబరెట్ అయి సినిమా చేయాలనేది అతని కల ఆయనను చూసుకుంటే పెరిగాడు. ఆయన వల్లే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. కాబట్టి తనలాంటి గొప్ప వ్యక్తితో పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావించే నాని శ్రీకాంత్ ఓదెల పుణ్యమాని చిరంజీవి సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు.

    ఇక నిన్న అఫీషియల్ గా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కాబట్టి నాని కూడా తన కలను నెరవేర్చిన శ్రీకాంత్ ఓదెలకి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక ఏది ఏమైనా కూడా నాని లాంటి యంగ్ హీరో ఇలాంటి గొప్ప సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పుడు రాబోయే సినిమాతో నాని కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. తన తోటి హీరోలు స్టార్ హీరోలుగా ఎదుగుతున్న సందర్భంలో నాని మాత్రం మీడియం రేంజ్ హీరోగానే కొనసాగుతున్నాడు.

    మరి ఎందుకు ఇలాంటి ఒక వైఖరిని అనుసరిస్తున్నాడు అనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికి నాని మాత్రం చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ విషయంలో నాని చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో మరి తర్వాత సినిమాలతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడనేది తెలియాల్సి ఉంది…