ShivaShankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటీవలే కోవిడ్ బారిన పడిన ఆయన.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో, టాలీవుడ్ ప్రముఖులు, సినిమా హీరోహీరోయిన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి, సోనుసూద్, మంచు వష్ణుతో పాటు పలువు హీరోలు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మరోవైపు రాజమౌళి కూడా శివశంకర్ మాస్టర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

తన సినీ కెరీర్లో వందల సినిమాలకు తన డాన్స్‌తో కొరియోగ్రఫి అందించారు. అలాంటి మాస్టర్ చివరి కోరిక ఏంటో తెలుసా?.. ఆయన తుది శ్వాస వరకు పని చేస్తూనే అండాలని అనుకున్నారట. తనకు మరణం అంటూ వస్తే.. షూటింగ్‌లోనే రావాలని.. సెట్స్‌లోనే కన్నుమూయాలనేది ఆయన కోరికట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.
Also Read: కరోనాకు కూలిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్
ఈ ఒక్కమాటను బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఆయనకు కళపై ఉన్న మక్కువేంటో. 2011లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమాకు ఆయన జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించేందుకు హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తీసుకెల్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
Also Read: కళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన శివ శంకర్ మాస్టర్ లైఫ్ జర్నీ ఇదే ..!