Ramoji Rao: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడు బయటకు రాని ఆయన ఇటీవల కాలంలో రెండుమార్లు ప్రముఖులకు లేఖలు రాస్తూ తనలో ఉన్న ఏ భావాన్ని చాటారో అర్థం కాని పరిస్థితి. గతంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనను పొగుడుతూ లేఖ రాశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితను ప్రశంసిస్తూ మరో లేఖ రాశారు. దీంతో అందరిలో అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఆయన లేఖ రాయాల్సిన అవసరం ఏమిటి? ఏదో స్పందించి ఉంటే శుభాకాంక్షలు ఫోన్ లో చెబితే సరిపోయేది దానికి లేఖలు రాయాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే వాదన బలంగా వినిపిస్తోంది.

దీనిపై లోతుగా ఆరా తీస్తే ఆయనకు రాజకీయాలపై మక్కువ ఏర్పడిందో ఏమో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ కుటుంబంతో సఖ్యత పెంచుకుని రాజకీయాల్లో అడుగిడాలని చూస్తున్నారేమో అనే విషయం అందరిలో వస్తోంది. దీంతోనే ఆయన వారికి లేఖలు రాస్తున్నారా? ఇంకా ఏదైనా రహస్యం దాగి ఉందా? అనే కోణంలో అందరిలో ఒకటే ఆతృత నెలకొంది.
Also Read: మళ్లీ ఈనాడు గ్రూపుకు ఊపు.. రంగంలోకి రామోజీ
ఈ నేపథ్యంలో రామోజీ లేఖల వ్యవహారం ఇప్పుడు రాష్ర్టంలో హల్ చల్ చేస్తోంది. గతంలో కూడా ఆయన ఎవరికి కూడా లేఖలు రాసిన సందర్భాలు లేవు. కానీ అనుకోకుండా ఇలా రాష్ర్ట నేతలకు ఒక్కసారిగా లేఖలు పంపడం వెనుక విషయం ఏమై ఉంటుందనే దానిపై మాత్రం ఇంకా ఎవరికి స్పష్టత రావడం లేదు. రామోజీరావు మదిలో ఏముందో ఎవరికి అర్థం కావడం లేదు.

మొత్తానికి రామోజీరావు రాసిన లేఖలపై ఆసక్తికర చర్చ మాత్రం నడుస్తోంది. రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఏం ఆశిస్తున్నారో తెలియడం లేదు. ఎందుకు రాశారో అంతు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో లేఖల వ్యవహారం రాష్ర్టమంతా చక్కర్లు కొడుతోంది. రామోజీరావు చేసిన నిర్వాకంపై ఇప్పుడు అందరు ఆలోచనలో పడిపోయారు.
Also Read: ఈటీవీ నుండి ఓటీటీ.. రామోజీ ప్లాన్ అదిరింది !