spot_img
Homeఎంటర్టైన్మెంట్Director Bala: డైరెక్టర్ బాలా ఒక సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి నటీ నటులను ఎలా...

Director Bala: డైరెక్టర్ బాలా ఒక సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి నటీ నటులను ఎలా కొడతారో తెలుసా..? వీడియో వైరల్…

Director Bala: సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. నిజానికి సినిమా చూసే ప్రేక్షకులు మైండ్ లో సినిమాల్లో నటించే నటీనటులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళు డైలాగ్స్ చెబితే సరిపోతుంది లక్షల్లో డబ్బులు సంపాదించొచ్చు అని అనుకుంటారు. కానీ ఒక క్యారెక్టర్ కోసం వాళ్ళు పెట్టె ఎఫర్ట్స్ వాళ్ళు తీసుకునే డైట్, వాళ్ళ బాడీ మెయింటెనెన్స్ కోసం పడే కష్టం ఎవరికి కనిపించదు. ఇక అనుకున్న సీన్ అనుకున్నట్టుగా రాకపోతే ఒక దర్శకుడు ఆర్టిస్ట్ లను ఎలాంటి ఇబ్బందులు పెడతాడు అనేది కూడా ఎవరికీ తెలియదు.

నిజానికి కొంతమంది దర్శకులు ఈజీగా సినిమాలను తీసేస్తుంటే మరి కొంత మంది మాత్రం పర్ఫెక్షన్ కోసం ఒక్కొక్క సీన్ ను దాదాపు 30 నుంచి 40 టేకుల వరకు కూడా చేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో నటీ నటులు విపరీతమైన ఇబ్బందులకు గురవ్వల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దర్శకుడిని సాటిస్ఫై చేయకపోతే మాత్రం ఆ నటులను మరొక సినిమాలో తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అందువల్ల దర్శకుడు పర్ఫెక్షన్ ను సాటిస్ఫై చేసేలా యాక్టింగ్ చేస్తూ ప్రేక్షకుల్లో వీళ్ల కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. ఇక నటి నటుల దగ్గర నుంచి పర్ఫామెన్స్ రాబట్టుకోడానికి ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క స్ట్రాటజీని అప్లై చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన బాలా గురించి చూసుకుంటే ఆయన సినిమాల్లో నటీనటుల పర్ఫామెన్స్ చాలా రియలెస్టిక్ గా ఉంటుంది అని అందరూ చెబుతూ ఉంటారు.

దాని వెనక కారణం ఏంటి అంటే ఆయన ప్రతి సీన్ ను రియలేస్టిక్ గా తెరకెక్కించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి హీరో ఏడ్చే సీన్ ఉంటే అందులో బాలా గారు ఆ హీరోని కొట్టయినా సరే అతని చేత ఏడిపిస్తాడు. అలాగే ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఆ అమ్మాయి చేసే పోరాటం ఎలా ఉండాలి అనే విషయంలో ఆ అమ్మాయిని కర్ర తో కొట్టి ఆమెలో ఒక తిరుగుబాటు భావాన్ని తీసుకువస్తాడు. అందుచేత వాళ్ళు చేసే నటన చాలా జన్యున్ గా ఉంటుంది. ఇక నిజానికి బాలా చేతిలో దెబ్బలు తిన్న నటినటులు చాలామంది ఉన్నారు. ఆయన చేసిన ‘శివపుత్రుడు ‘ సినిమాలో విక్రమ్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండడమే కాకుండా చాలా నిజాయితీగా ఉంటుంది. దానికోసం ఆయన విక్రమ్ ని చాలాసార్లు ఇబ్బందులకు గురి చేసారట. అయితే విక్రమ్ పర్ఫామెన్స్ సరిగ్గా లేకపోతే బాలా విక్రమ్ ను చాలా సార్లు కొట్టి అతని చేత యాక్టింగ్ చేయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలా నటీ నటులను కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

ఇది చూసిన ఎవరైనా సరే నటులుగా రాణించాలంటే ఇంత కష్టమా? అనే ఒక అభిప్రాయానికి వస్తున్నారు. నిజానికి బాలా కావాలని వాళ్ళని కొట్టలేదు. పర్ఫామెన్స్ రాబట్టుకోవడానికి తను అలా చేశాడంటూ మరికొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు…బాలా సినిమాలో నటించిన నటీనటులు ప్రస్తుతం చాలా ఉత్తమమైన స్థాయిలో ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. శివ పుత్రుడు సినిమాలో నటించినందుకు గాను విక్రమ్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఆ సినిమాతో తెలుగు, తమిళ్ రెండింటిలో సూర్యకి, విక్రమ్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆయన ఇచ్చిన గుర్తింపు తోనే వాళ్ళు అప్పటినుంచి ఇప్పటివరకు తమిళ్ తెలుగు రెండు భాషల్లో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు…
REALITY IN THE MAKING !!!

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version