Homeఆంధ్రప్రదేశ్‌Minister Supporters Dance: మంత్రిగారి అనుచరుల..బూతు స్టెప్పులు.. ఈ అరాచకం చూడలేం బాబోయ్.. వైరల్ వీడియో

Minister Supporters Dance: మంత్రిగారి అనుచరుల..బూతు స్టెప్పులు.. ఈ అరాచకం చూడలేం బాబోయ్.. వైరల్ వీడియో

Minister Supporters Dance: వాళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి గారి అనుచరులు. సహజంగా మంత్రి అనుచరులు అంటే సమాజంలో ఉండే రేంజ్ వేరే ఉంటుంది. ఎందుకంటే అధికారం వారి చేతిలో ఉంటుంది కాబట్టి ఏ పనులైనా చేయగలుగుతారు.. ఎలాంటి పని అయినా చేసి పెడతారు. పైగా అధికారులతో నిత్యం టచ్ లో ఉంటారు. అభివృద్ధి పనులు.. సంక్షేమ పథకాలు.. ఇతర వ్యవహారాలు మొత్తం వాళ్ల చేతిలో ఉంటాయి.

ఇంతటి స్థాయి ఉన్న వారు.. తమకున్న పేరుకు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల్సి ఉండేది. అలాకాకుండా సిగ్గు విడిచారు. తమ స్థాయిని మర్చిపోయారు.. ఇలాంటి పనులు సభ్య సమాజంలోకి వెళ్తే ఎలా ఉంటుందో కూడా ఆలోచించుకోలేకపోయారు. ఇష్టానుసారంగా చిందులు తొక్కారు. అది కూడా అత్యంత దారుణంగా.. అత్యంత నిస్సిగ్గుగా ప్రవర్తించారు. అసలు ఆ వీడియోలో దృశ్యాలు చూస్తుంటే ఇబ్బందికరంగా ఉంది. అలాంటప్పుడు వీడియో రికార్డు ఎలా చేశారు.. వీడియో రికార్డు చేస్తుంటే ఏమీ అనిపించలేదా.. అసలు మంత్రిగారి అనుచరులు ఇలా కూడా వ్యవహరిస్తారా.. అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ మంత్రికి సంబంధించిన అనుచరులు బందరు ప్రాంతంలో రాణి గారి సెంటర్లో ఒక జ్యువెలరీ షాప్ మీద ఉన్న రూంలో రికార్డ్ డాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ చేస్తున్న వ్యక్తులు సైదారావు.. హితేష్.. ఆంజనేయులు అని తెలుస్తోంది. అమ్మాయిలతో వారు దారుణమైన స్థితిలో ఆడి పాడినట్టు సమాచారం. అయితే సైదారావు.. హితేష్ డాన్సులు చేస్తుంటే.. ఇక్కడ పట్టుకో.. అక్కడ పట్టుకో అంటూ ఆంజనేయులు వారిని ఎంకరేజ్ చేశాడు. అంతేకాదు వారి డాన్సులు చేస్తుంటే వీడియో షూట్ కూడా తనే చేశాడు. ఈ అమ్మాయిలను గుడివాడ నుంచి రప్పించారు. రికార్డింగ్ డాన్స్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఆ మంత్రి గారు వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version