https://oktelugu.com/

 Sreeleela : చిరంజీవికే ఝలక్ ఇచ్చిన శ్రీలీల… కుర్ర హీరోయిన్ నుండి ఊహించని పరిణామం!

ఏకంగా చిరంజీవి సినిమాలో ఆఫర్ రిజెక్ట్ చేసిందట యంగ్ హీరోయిన్ శ్రీలీల. భారీ రెమ్యునరేషన్ ఇస్తానన్న చేయను అని చెప్పేసిందట. టాలీవుడ్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 18, 2024 / 06:53 PM IST

    Sreeleela

    Follow us on

    Sreeleela : హీరోయిన్ శ్రీలీల పేరు గత ఏడాది టాలీవుడ్ లో మారుమోగింది. నెలల వ్యవధిలో శ్రీలీల నటించిన సినిమాలు విడుదలయ్యాయి. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మహేష్ బాబు, రవితేజ, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే వీటిలో హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువ ఉన్నాయి. దాంతో శ్రీలీల కాస్త స్పీడ్ తగ్గించింది. గత సినిమాల విషయంలో చేసిన తప్పులు రిపీట్ కాకూడదని ఆమె జాగ్రతగా నిర్ణయాలు తీసుకుంటుందట. వచ్చిన ఆఫర్స్ గుడ్డిగా అంగీకరించకూడదని ఫిక్స్ అయ్యిందట. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవికే ఝలక్ ఇచ్చిందని అంటున్నారు.

    పెళ్ళిసందడి(2021) సినిమాతో శ్రీలీల టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా శ్రీలీల డ్యాన్సులు, అందానికి యూత్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత రవితేజకు జంటగా ధమాకా మూవీలో నటించింది. తన క్యూట్ నెస్ తో ఆడియన్స్ ని కట్టిపడేసింది. ధమాకా సూపర్ హిట్ అవడంతో శ్రీలీల టైం మొదలైంది. తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంది. ఒకానొక సమయంలో క్షణం కూడా తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొంది. మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో ఛాన్స్ పట్టేసింది. గుంటూరు కారంలో మహేష్ బాబు-శ్రీలీల జంటగా నటించిన సంగతి తెలిసిందే.

    శ్రీలీల గ్లామర్ ఒక ఎత్తైతే ఆమె డాన్స్ మరో ఎత్తు. అందం, అభినయం ఉన్నపటికీ ఆమెకు అదృష్టం మాత్రం కలిసి రావడంలేదు. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్న శ్రీలీల ఇప్పుడు మళ్లీ నటిగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ తో రాబిన్ హుడ్ చేస్తుంది. అలాగే రవితేజకు జంటగా ఓ సినిమాకు సైన్ చేసింది. తమిళం, హిందీలో భాషల్లో కూడా మూవీస్ చేస్తుంది.

    తాజాగా శ్రీలీలకు చిరంజీవి సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఆమె ఆ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ మూవీగా దర్శకుడు వశిష్ట దీన్ని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం దర్శక నిర్మాతలు శ్రీలీలను సంప్రదించారట. ఈ ఆఫర్ ని శ్రీలీల తిరస్కరించిందట. భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినప్పటికీ ఐటెం సాంగ్ చేయనని చెప్పేసిందట. ఇప్పుడిపుడే మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది శ్రీలీల. ఇటువంటి టైం లో స్పెషల్ సాంగ్స్ చేస్తే ఆ ప్రభావం తన కెరీర్ పైన పడుతుందని ఆమె భావిస్తోందట. అందుకే చిరంజీవి మూవీలో స్పెషల్ సాంగ్ కి నో చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

    గతంలో కూడా శ్రీలీలకు స్పెషల్ సాంగ్ ఆఫర్స్ వచ్చాయి. ప్లాప్స్ పడుతున్న తరుణంలో ఐటెం సాంగ్స్ చేస్తే… ఇమేజ్ మారిపోయే ప్రమాదం ఉంది. ఐటెం బాంబ్ గా జనాల్లో రిజిస్టర్ అయ్యిందంటే స్టార్ హీరోయిన్ హోదా ధమాల్ అంటుంది. అందుకే తెలివిగా విశ్వంభర మూవీ ఆఫర్ ని ఆమె తిరస్కరించారని అంటున్నారు. మరోవైపు మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో శ్రీలీలకు ఆఫర్ వచ్చిందనే ప్రచారం జరుగుతుంది.