https://oktelugu.com/

Mission Milkipur : మిషన్ మిల్కీపూర్’తో బీజేపీ సరికొత్త వ్యూహం.. ఈ సారి అయోధ్యపై పట్టు సాధిస్తుందా?

గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన అయోధ్య సీటును కోల్పోయిన బీజేపీ సమీపంలోని ‘మిల్కీపూర్’ అసెంబ్లీ స్థానంను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకపోయినా.. పన్నా సమితులను అలెర్ట్ చేసింది. ఎలాగైనా ఈ సీటును దక్కించుకొని 2027 అసెంబ్లీ ఎన్నికలకు నాంది పలకాలనీ యోగా బాబా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Written By:
  • Bhaskar
  • , Updated On : August 18, 2024 6:06 pm
    Milkipur by-election

    Milkipur by-election

    Follow us on

    Mission Milkipur : అయోధ్య లోక్ సభ స్థానాన్ని కోల్పోయిన కాషాయ పార్టీ (బీజేపీ) తన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు పావులు కదుపుతోంది. మిల్కీపూర్ ఉప ఎన్నిక రాబోతోంది. ఈ ఎన్నికను సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, చంద్రశేఖర్ ఆజాద్ పార్టీలు విజయంపై కన్నేశాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ సీటు దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ తగిన ఏర్పాటు చేసుకుంటుంది. అమేథీ, సుల్తాన్పూర్ సరిహద్దుల్లో అయోధ్యలోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానం ఉంది. ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అవదేశ్ ప్రసాద్ ఎంపీకి పోటీ చేసి విజయం సాధించాడు. దీంతో అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశాడు. దీంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. అక్కడ తర్వలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఉప ఎన్నిక తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనప్పటికీ ముందస్తు ఎన్నికల కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ‘భయ్యా, మహారాజ్ జీ కీ ఇజ్జత్ కా సావల్ హై (ఇది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రతిష్టాత్మకమైన విషయం). ఇది సాధారణ ఉప ఎన్నిక కాదు.’ అని వచ్చే వారం జరగనున్న ఆదిత్య నాథ్ పర్యటనకు సిద్ధమవుతున్న ఒక బీజేపీ కార్యకర్త వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికకు ముందు పక్షం రోజుల్లో సీఎం అయోధ్యను సందర్శించడం ఇది రెండోసారి. యోగి ఆదిత్యనాథ్ ఆగస్ట్ 7న అయోధ్యను సందర్శించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమై ప్రజలతో మమేకమై అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయాలని కోరారు. ఈ పథకాలు సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రతిపక్షాల ప్రయత్నాలను తిప్పికొట్టాలని కార్యకర్తలను ప్రోత్సహించారు. అధికారులు చురుకుగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు’. అని బీజేపీ కార్యకర్త ఒకరు తెలిపారు.

    2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏం జరిగింది?
    దేవుడి జన్మస్థలంలో రామ మందిరాన్ని నిర్మిస్తామన్న తన చిరకాల వాగ్ధానాన్ని నెరవేర్చిన కొద్ది నెలలకే ఆలయ పట్టణం అయోధ్యతో సహా ఫైజాబాద్ నియోజకవర్గంలో బిజెపి ఆశ్చర్యకరమైన ఓటమిని చవిచూసింది. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ 54,567 ఓట్ల ఆధిక్యంతో సిట్టింగ్ బీజేపీ ఎంపీ లల్లూ సింగ్‌పై విజయం సాధించారు. ప్రసాద్‌కు 5,54,289 ఓట్లు రాగా, సింగ్ కు 4,99,722 ఓట్లు వచ్చాయి. యూపీలోని 80 లోక్ సభ నియోజకవర్గాల్లో ఒకటైన ఫైజాబాద్ స్థానం రామ మందిర స్థలమైన అయోధ్యను చుట్టుముట్టడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. చారిత్రాత్మకంగా అయోధ్య మతపరమైన ప్రాముఖ్యతపై ఆధారపడినా బీజేపీకి ఈ ఓటమి ఎదురుదెబ్బగా మారింది.

    బీజేపీ పరాజయానికి కారణమేంటి..?
    2024లో బీజేపీ అయోధ్యను కోల్పోవడమే కాకుండా రామమందిర ప్రారంభోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని రాజకీయ పరిశీలకుడు, ఫైజాబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బలరామ్ తివారీ అన్నారు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలే ఓటర్లను బీజేపీ నుంచి పక్కకు తీసుకెళ్లాయని అన్నారు. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ మళ్లీ గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందన్న ప్రతిపక్షాల వాదనలు కూడా ఓటమికి కారణంగా మారింది.

    మిల్కీపూర్, సోహావాల్ నుంచి 9 సార్లు దళిత ఎమ్మెల్యేగా గెలిచిన అవదేశ్ ప్రసాద్ ను బరిలోకి దింపాలని సమాజ్ వాదీ పార్టీ తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. మిల్కీపూర్ లో దళిత సామాజికవర్గం అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉంది. ఇది సమాజ్ వాదీ కూటమికి ముస్లిం-యాదవ్ మద్దతిస్తుంది. దీనికి తోడు బ్రాహ్మణ అభ్యర్థి సచ్చిదానంద్ పాండేను బరిలోకి దింపాలని బీఎస్పీ తీసుకున్న నిర్ణయం బీజేపీ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఈ అంశాలు కలిసి బీజేపీ అనూహ్య ఓటమికి దోహదం చేశాయని, ఈ ప్రాంతంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులను ఎత్తిచూపుతున్నాయన్నారు.

    అయోధ్యలో బీజేపీ పట్టు సాధిస్తుందా?
    బీజేపీ ‘మిషన్ మిల్కీపూర్’ అని ప్రచారం ప్రారంభించినప్పటికీ, గెలుపు పెను సవాలేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 4 నెలల్లో అయోధ్యలో ప్రజాభిప్రాయం మారిందని తివారీ అన్నారు. మిల్కీపూర్ ఉపఎన్నిక 2026లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు నాందిగా తీసుకోవాలని ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయంపై కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. లల్లూ సింగ్ ను బరిలోకి దింపాలన్న పార్టీ నిర్ణయంపై వారిలో ఉన్న వ్యతిరేకత తగ్గింది.

    2022లో ఎస్పీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ చేతిలో కేవలం 13,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన పాసీ అయిన మిల్కీపూర్ మాజీ ఎమ్మెల్యే బాబా గోరఖ్ నాథ్ ను బీజేపీ తిరిగి బరిలోకి దింపే అవకాశం ఉందని తివారీ అన్నారు. 2017లో 32 ఏళ్ల గోరఖ్ నాథ్ 72 ఏళ్ల లాలూ ప్రసాద్ ను 26 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు. సమాజ్ వాదీ పార్టీ కూడా మిల్కీపూర్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అవదేశ్ ప్రసాద్ కుమారుడు అజిత్ ను బరిలోకి దింపి పోటీని ‘పాసి వర్సెస్ పాసి’గా మార్చాలని భావిస్తోంది. ఈ సారి బీఎస్పీ కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించగా, చంద్రశేఖర్ ఆజాద్ కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) అభ్యర్థిని బరిలోకి దింపనుంది.

    కీలకమైన అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జిలను నియమించిన ఆజాద్. నగీనా లోక్ సభ స్థానాన్ని గెలుచుకున్న తర్వాత తన పార్టీ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. దళిత ఓటర్లు ఏఎస్పీ వైపు మళ్లడం కూడా బీఎస్పీని ఆందోళనకు గురి చేసింది, మిల్కీపూర్ సహా ఖాళీగా ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు ప్రకటించారు. దీంతో హోరాహోరీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది.

    బూత్ స్థాయి కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని, పన్నా సమితులను పెంచాలని బీజేపీ ఇప్పటికే అయోధ్య విభాగాన్ని కోరింది. అయోధ్యలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు నలుగురు ఉత్తరప్రదేశ్ మంత్రులు (సూర్య ప్రతాప్ షాహి, మయాంక్ సింగ్, గిరీష్ యాదవ్, సతీష్ శర్మ)తో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసిన యోగి ఆదిత్యనాథ్, ఓటర్లను ఉత్తేజపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్న మత సమాజం నుంచి క్షేత్ర స్థాయి ఫీడ్ బ్యాక్ పొందేందుకు పీఠాధిపతులతో చర్చలు జరుపుతున్నారు.

    ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు లోక్ సభకు ఎన్నికవడంతో మిల్కీపూర్ తో పాటు మరో 8 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎస్పీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి దోషిగా తేలడంతో మిగిలిన సిసామౌ (కాన్పూర్) స్థానం ఖాళీ అయింది.