Divvela Madhuri: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఉన్నది తక్కువ రోజులే అయినా, ఆడియన్స్ పై బలమైన ప్రభావం చూపించిన కంటెస్టెంట్స్ లో ఒకరు దివ్వెల మాధురి. రాజకీయంగా చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు నుండే మంచి పలుకుబడి ఉన్న సెలబ్రిటీ ఈమె. నెగిటివిటీ కూడా తారా స్థాయిలో ఉండేది. ఆమె ని చూస్తూనే ఆడియన్స్ చిరాకు పడేవారు. అలాంటి మనిషిని బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు తీసుకొస్తున్నారు అని ఒక రేంజ్ లో తిట్టడం మొదలు పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఈమె అడుగుపెట్టిన మొదటి వారం లో ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆడియన్స్ కి హై బీపీ వచ్చేలా చేసింది. కానీ రెండవ వారం లో ఈమె తెలియకుండానే ఆడియన్స్ కి చిన్నగా కనెక్ట్ అవ్వడం మొదలు పెట్టింది.
అనుకున్నంత వరస్ట్ కంటెస్టెంట్ కాదు, ఉన్నన్ని రోజులు ఉన్నింది, వెళ్లాలని అనుకున్నప్పుడు, సేవ్ అయ్యే ఛాయస్ తన దగ్గర ఉన్నప్పటికీ కూడా దానిని ఉపయోగించుకోకుండా ఎలిమినేట్ అయ్యింది, పర్లేదు మంచి మనిషి అని అంతా అనుకున్నారు. ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు, ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ తన భార్య బిగ్ బాస్ ద్వారా సంపాదించే డబ్బు ని పేదలకు విరాళంగా అందిస్తామని చెప్పుకొచ్చాడు. ఇదేదో కేవలం మాటవరుసకు అని ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ నిజంగానే వీళ్లిద్దరు ‘బిగ్ బాస్ 9’ రెమ్యూనరేషన్ ని పేదలకు విరాళంగా అందించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే దువ్వాడ శ్రీనివాస్, మాధురి దంపతుల అనుచరుడిగా మొదటి నుండి ఉంటూ వస్తున్నా లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. రీసెంట్ గానే ఇతను హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకుంటున్నాడు.
అతడిని పరామర్శించడానికి హాస్పిటల్ కి వెళ్లిన దువ్వాడ దంపతులు లక్ష్మి నారాయణ కి 80000 రూపాయిలు ఆర్ధిక సాయం అందించారు. అందులో 30000 రూపాయిలు ఆసుపత్రి వైద్య ఖర్చులు కాగా, కుటుంబ పోషణ కోసం మరో 50 వేల రూపాయిలు అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను దువ్వాడ శ్రీనివాస్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి నెటిజెన్స్ కి తెలియజేయడం తో అవి బాగా వైరల్ అయ్యాయి. అయితే దివ్వెల మాధురి కి వచ్చిన బిగ్ బాస్ రెమ్యూనరేషన్ కేవలం 80 వేల రూపాయిలు మాత్రమేనా?, ఈమె సెలబ్రిటీ క్యాటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టింది. మూడు వారాలు కొనసాగింది. వారానికి లక్ష రూపాయిల చొప్పున కనీసం మూడు లక్షల రెమ్యూనరేషన్ అయినా ఇచ్చి ఉంటారని అంతా అనుకున్నారు, కానీ ఇంత తక్కువ రెమ్యూనరేషన్ అసలు ఊహించలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.