Star Heroes controversy: సినిమా ఇండస్ట్రీ అనేది బయట నుంచి చూసేవాళ్లకు రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న ఒక 20% మంది మాత్రమే ఇక్కడ లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్నారు. మిగతా 80% జనాలు సినిమా మీద ఆధారపడి వచ్చి రాని డబ్బులతో ఏదో ఒకలా జీవితాన్ని గడుపుతున్నారు. నిజానికి కొంతమంది చిన్న చితక పాత్ర లను చేస్తూ కాలం గడుపుతున్నారు. స్టార్ హీరోలు మాత్రం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్స్ తీసుకొని సినిమాలను చేస్తు టాప్ రేంజ్ కి వెళ్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియాలో సైతం భారీ విజయాలను సాధిస్తున్నారు. కొంతమంది హీరోలు సినిమాల్లో నీతులను చెబుతూ బయట మాత్రం అన్ని బూతులు వాడుతున్నారు అంటూ చాలామంది జనాలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకొని మరి వాళ్ళ వైఫ్ లకు విడాకులను ఇచ్చే పరిస్థితి దాకా తెచ్చుకుంటున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా సినిమా హీరోలు అంటే స్క్రీన్ మీద కనిపించి అన్యాయం జరిగితే ఎదురించి సినిమాని సక్సెస్ చేసేంతవరకు మాత్రమే వాళ్లు హీరోలు… బయట మాత్రం వాళ్లు నార్మల్ మనుషులే అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా అనేది వాళ్ల వృత్తి మాత్రమే దాన్ని చూసి వాళ్ల పర్సనల్ లైఫ్ లో కూడా మంచి లక్షణాలతో ఉంటారు అనుకోవడం మన మూర్ఖత్వం…
Also Read: రామ్ చరణ్ కి ఇష్టం లేకపోయిన చిరంజీవి ఫోర్స్ తో చేసిన సినిమాలు ఏంటంటే..? ఆ మూవీ హిట్టా? ఫట్టా?
నిజ జీవితంలో మామూలు మనుషులు ఎలా ఉంటారో వాళ్ళు కూడా అలానే ఉంటారు. వాళ్ళని హైలెట్ చేసి చూడడం జనాల తప్పు అంటూ జనాలను సైతం కొంతమంది విమర్శిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్న కొంత మంది వెనకల ఇలాంటి కొన్ని చీకటి కోణాలు కూడా ఉన్నాయి.
వాటిని చక్కదిద్దుకొని నలుగురికి ఆదర్శంగా నిలిచే పనులు చేస్తే బాగుంటుంది అంటూ వాళ్ళను ఉద్దేశించి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…ఇక ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరు అలాంటి వాళ్ళని కాదు. కొంత మంది హీరోలు చాలా మంచి వారు ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. పేదలకు సహాయం చేస్తున్నారు. కానీ కొందరు చేసే చెడు పనుల వల్ల అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది…