Homeబిజినెస్Top 6 SUVs sold in February 2026: ఫిబ్రవరి నెలలో విక్రయాలు జరుపుకున్న టాప్...

Top 6 SUVs sold in February 2026: ఫిబ్రవరి నెలలో విక్రయాలు జరుపుకున్న టాప్ 6 SUV లు ఇవే..

Top 6 SUVs sold in February 2026: కాలం మారుతున్న కొద్ది కార్ల కొనుగోలుపై ఆసక్తి పెరుగుతోంది. ఇందులో భాగంగా ఎక్కువగా కాంపాక్ట్ SUV కార్లకు ఆదరణ పెరుగుతుంది. అయితే ఒకప్పుడు మారుతి సుజుకి కంపెనీకి చెందిన కార్లు విక్రయాల్లో అగ్రస్థానంలో ఉండేవి. కానీ టాటా కంపెనీకి చెందిన కార్లు ఇప్పుడు వాటిని అధిగమిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి నెలలో అమ్మకాలను చూస్తే మారుతి సుజుకి కార్ల కంటే టాటా కంపెనీకి చెందిన వెహికిల్స్ ఎక్కువగా సేల్స్ […]

Top 6 SUVs sold in February 2026: కాలం మారుతున్న కొద్ది కార్ల కొనుగోలుపై ఆసక్తి పెరుగుతోంది. ఇందులో భాగంగా ఎక్కువగా కాంపాక్ట్ SUV కార్లకు ఆదరణ పెరుగుతుంది. అయితే ఒకప్పుడు మారుతి సుజుకి కంపెనీకి చెందిన కార్లు విక్రయాల్లో అగ్రస్థానంలో ఉండేవి. కానీ టాటా కంపెనీకి చెందిన కార్లు ఇప్పుడు వాటిని అధిగమిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి నెలలో అమ్మకాలను చూస్తే మారుతి సుజుకి కార్ల కంటే టాటా కంపెనీకి చెందిన వెహికిల్స్ ఎక్కువగా సేల్స్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో టాటా కంపెనీకి చెందిన Nexon ముందంజలో ఉంది. ఇవే కాకుండా మిగతా కంపెనీకి చెందిన ఏ కార్లో ఎన్ని విక్రయాలు జరుపుకున్నాయో చూద్దాం..

TATA కంపెనీకి చెందిన Nexon ఫిబ్రవరి నెలలో 19,430 యూనిట్ల విక్రయాలు జరుపుకున్నాయి. ఈ కారు ధర రూ.8 లక్షల ప్రారంభ నుంచి రూ.14 లక్షల వరకు ఉంది. పెట్రోల్ తో పాటు డీజిల్ ఇంజన్ ఉండే ఇది లీటర్ ఇంతరానికి 24.08 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 5 స్టార్ రేటింగ్ కలిగిన ఇందులో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్ వంటివి ఉన్నాయి.

కాంపాక్ట్ SUV కార్ల విక్రయాల్లో Maruti Suzuki కంపెనీకి చెందిన Dezire రెండో స్థానంలో నిలిచింది. ఈ కారు 19,326 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. దీనిని రూ. 6.26 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.9.31 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇందులో 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. 5 స్టార్ రేటింగ్ పొందిన ఇందులో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫో డైమండ్ సిస్టం తో పాటు 350 డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి. లీడర్ ఇంధనానికి 25.71 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

టాటా కంపెనీకి చెందిన మరో కారు పంచ్ ఫిబ్రవరి నెలలో 18748 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది. దీనిని రూ.5.59 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.10.54 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు CNG ఆప్షన్ కూడా ఉంది. ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్ కూడా మార్కెట్లోకి వచ్చింది.

Hyundai కంపెనీకి చెందిన SUV Creta ఫిబ్రవరి నెలలో 17,938 యూనిట్ల విక్రయాలతో 4వ స్థానాన్ని ఆక్రమించింది. ఈ కారు ధర రూ.10.79 నుంచి రూ.20.20 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అలాగే మారుతి సుజుకి కంపెనీకి చెందిన Brezza 17,863 కార్ల అమ్మకాలతో ఐదవ స్థానంలో నిలిచింది. ఇదే కంపెనీకి చెందిన ఎర్టిగా 17,807 యూనిట్లు విక్రయించి ఆరస్థానంలో నిలిచింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper