Gautam Gambhir: దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీరిద్దరూ సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టారు. రోహిత్ రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. విరాట్ రెండు శతకాలు, ఒక హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. తొలి, చివరి వన్డేలో రోహిత్ హాఫ్ సెంచరీ లు, విరాట్ ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ లు చేశారు. టీమిండియా సాధించిన విజయాలలో ముఖ్య పాత్ర పోషించారు. ఫీల్డింగ్ లో అయితే సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టుకు మూల స్తంభాలుగా నిలబడినప్పటికీ గౌతమ్ గంభీర్ కీలకమైన ప్రకటన చేశాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గౌతమ్ గంభీర్ వచ్చే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి దక్కే అవకాశం పై కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా అని విలేకరులు గౌతమ్ గంభీర్ ను ప్రశ్నించారు. దానికి అతడు కీలకమైన సమాధానం చెప్పాడు. గౌతమ్ గం బీర్ చెప్పిన సమాధానం స్పోర్ట్స్ వర్గాల్లో మరోసారి చర్చకు దారి తీసింది.
2027 వన్డే వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉందని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. అలాంటప్పుడు ఆ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడే విషయంపై తాను క్లారిటీ ఇవ్వలేనని గౌతమ్ గంభీర్ వివరించాడు. యువ ఆటగాళ్లు చక్కగా ఆడుతున్నారని, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. గౌతమ్ గంభీర్ ఆ తరహా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విరాట్, రోహిత్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మ్యాచ్ గెలిచినప్పటికీ.. సిరీస్ సొంతం చేసుకున్నప్పటికీ.. విరాట్ కోహ్లీ, రోహిత్ సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ గౌతమ్ గంభీర్ తన అక్కసు మొత్తాన్ని బయట పెట్టుకున్నాడని అభిమానులు పేర్కొంటున్నారు.
ఇటీవల తొలి మ్యాచ్ లో సూపర్ సెంచరీ చేసినప్పటికీ విరాట్ కోహ్లీని గౌతమ్ గంభీర్ అంతగా అభినందించలేదు. దీంతో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య సయోధ్య లేదని అందరూ అనుకున్నారు. అయితే అవన్నీ ఆరోపణలని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు. కానీ అవన్నీ నిజమని గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోందని అభిమానులు అంటున్నారు.