Homeఅంతర్జాతీయంSheikha Mahra divorce: ఇన్ స్టా గ్రామ్ లో భర్త కు విడాకులు..

Sheikha Mahra divorce: ఇన్ స్టా గ్రామ్ లో భర్త కు విడాకులు..

Sheikha Mahra divorce: నేటి కాలంలో భార్యాభర్తలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఏ విషయంలో కూడా సర్దుకుపోయే తత్వాన్ని ప్రదర్శించడం లేదు. వ్యక్తిగత అహాలకు వెళ్లి సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా పదికాలాల పాటు పచ్చగా ఉండాల్సిన కాపురాలు కూలిపోతున్నాయి. కోర్టు మెట్ల దాక వెళ్లి విడాకులు తీసుకుంటున్నాయి. ఇది మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా దర్జాగా సాగిపోతోంది. మనదేశం లో పెళ్లి చేసుకున్న దంపతులు విడిపోవాలంటే కోర్టు దాకా వెళ్లాలి. అనేక […]

Sheikha Mahra divorce: నేటి కాలంలో భార్యాభర్తలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఏ విషయంలో కూడా సర్దుకుపోయే తత్వాన్ని ప్రదర్శించడం లేదు. వ్యక్తిగత అహాలకు వెళ్లి సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా పదికాలాల పాటు పచ్చగా ఉండాల్సిన కాపురాలు కూలిపోతున్నాయి. కోర్టు మెట్ల దాక వెళ్లి విడాకులు తీసుకుంటున్నాయి. ఇది మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా దర్జాగా సాగిపోతోంది.

మనదేశం లో పెళ్లి చేసుకున్న దంపతులు విడిపోవాలంటే కోర్టు దాకా వెళ్లాలి. అనేక వాదనలు జరిగిన తర్వాత కోర్టు మంజూరు చేసిన విడాకుల ద్వారా దంపతులు విడి పోవాలి. ఇది అధికారిక ప్రక్రియ. కానీ కొన్ని దేశాలలో ఇలా ఉండదు. ముఖ్యంగా ముస్లిం దేశాలలో అసలు ఉండదు. అక్కడ నిఖా ఎంత ఈజీగా అయితే జరుగుతుందో.. విడాకుల ప్రక్రియ కూడా అలానే సాగిపోతూ ఉంటుంది.

ముస్లిం దేశాలలో అత్యంత సంపన్నమైన ప్రాంతంగా దుబాయ్ నగరానికి పేరు ఉంది. దుబాయ్ నగరంలో రాజుల పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ రాజులతో బహుభార్యత్వం అనేది సర్వసాధారణం. కొన్ని సందర్భాలలో లెక్కకు మిక్కిలి వివాహాలను అక్కడి రాజులు జరుపుకుంటారు. దుబాయ్ నగరంలో రాజులకు ఆదాయం విపరీతంగా ఉంటుంది. అక్కడ చమురు వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది. అందువల్లే అక్కడి రాజులు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా.. తాము మనసు పడిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు. దీనికోసం గతంలో చేసుకున్న భార్యల అనుమతి వారికి అవసరం లేదు.

ఇంత జరిగినప్పటికీ చాలామంది మహిళలు నోరు విప్పరు. ఎందుకంటే అక్కడ చట్టాలు అలా ఉంటాయి. కానీ దుబాయ్ ప్రాంతానికి చెందిన ఓ రాణి మాత్రం తొలిసారిగా ఈ వ్యవహారం మీద నోరు విప్పింది. తన భర్త లెక్కకు మిక్కిలి వివాహాలు చేసుకున్న నేపథ్యంలో నిరసన వ్యక్తం చేసింది. అంతేకాదు, మొహమాట లేకుండా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. “ఇప్పటికే నువ్వు అనేక వివాహాలు చేసుకున్నావ్. అందువల్లే నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను.. ఇట్లు మీ మాజీ భార్య అంటూ” దుబాయ్ యువరాణి స్టేటస్ పెట్టింది. సాధారణంగా ముస్లిం దేశాలలో తలాక్ ను భర్తలు చెబుతుంటారు. కానీ తొలిసారిగా దుబాయ్ యువరాణి తన విడాకుల వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తద్వారా తాను ఎదుర్కొన్న బాధను బహిరంగంగా ప్రకటించింది. అంతేకాదు, తాను మరొక వ్యక్తిని వివాహం చేసుకుంటున్నట్టు ప్రకటించింది. స్వేచ్ఛ అనేది పురుషులకు మాత్రమే కాదని.. స్త్రీలకు కూడా ఉండాలని ఆమె నిరూపించింది. అన్నట్టు ఈ విడాకులు ఇచ్చిన ఆ దుబాయ్ యువరాణి పేరు షికా మహర.

 

View this post on Instagram

 

A post shared by Gabbar (@justgabbarthings)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper