Director Shekhar Kammula Daughter: మన టాలీవుడ్ లో హీరోలతో సంబంధం లేకుండా ఆడియన్స్ ని థియేటర్స్ కి రాబట్టే బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న డైరెక్టర్స్ లిస్ట్ చాలా తక్కువ ఉంది. ఆ తక్కువమంది లో ఒకరు శేఖర్ కమ్ముల(Sekhar Kammula). కెరీర్ ప్రారంభం నుండి ఆయన కొత్త హీరోలతోనే సినిమాలు చేసి హిట్స్ ని అందుకున్నాడు. ఆనంద్, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చిత్రాలతో ఆయన కొత్తవాళ్లతో వచ్చి ఇండస్ట్రీ ని షేక్ చేశాడు. ఇక ఆ తర్వాత ఆయన కెరీర్ లో గోదావరి, ఫిదా, లవ్ స్టోరీ వంటి భారీ కమర్షియల్ హిట్స్ కూడా ఉన్నాయి. ఇక చాలా కాలం నుండి బ్లాక్ బస్టర్ లేకుండా ఇబ్బంది పడుతున్న నాగార్జున కి కూడా రీసెంట్ గానే ‘కుబేర’ రూపం లో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు.
Also Read: వాళ్లంతా సర్వనాశనం అయిపోతారు అంటూ శాపనార్ధాలు పెట్టిన మంచు లక్ష్మి!
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు శేఖర్ కమ్ముల ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సినిమా సినిమాకు శేఖర్ కమ్ముల తీసుకునే భారీ గ్యాప్ కారణంగా నేడు పాన్ ఇండియన్ డైరెక్టర్స్ లిస్ట్ లో లేడు కానీ, ఆయనకు ఉన్న టాలెంట్ కి, ఆలోచనలకి కచ్చితంగా పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఒకడిగా ఉండేవాడని విశ్లేషకుల అభిప్రాయం. ఇకపోతే శేఖర్ కమ్ముల తన వ్యక్తిగత జీవితాన్ని బహిర్గతం చేయడానికి అంతగా ఇష్టం చూపించడు. కానీ ఈమధ్య కాలం లో ఆయన కూతురు వందన ఎక్కువగా సోషల్ మీడియా లో కనిపిస్తూ ఉంటుంది.
ఈమె కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సందడి చేసింది. అప్పట్లో ఈమెను అంతగా ఎవ్వరూ గుర్తించలేకపోయారు కానీ, సినిమా విడుదల అయ్యాక కుబేర కి ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా బాగా వైరల్ అయ్యింది. ఇకపోతే రీసెంట్ గా ఆమె పుట్టిన రోజు వేడుకలను చాలా గ్రాండ్ గా జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా అప్లోడ్ చేసింది. సోషల్ మీడియా లో ఈమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆమె ఫోటోలు బాగా వైరల్ అవ్వడం తో, ఇన్ స్టాగ్రామ్ లో ఆమెని వెతికి అనుసరించే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని క్రింద అందిస్తున్నాము చూడండి. చూసేందుకు నేటి తరం యంగ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న వందన ఫోటోలను మీరు కూడా చూసేయండి.
View this post on Instagram