Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీ లో ప్రస్తుతం ఒక స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) మాత్రమే. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అంతే కాదు లవ్ స్టోరీస్ లో కల్ట్ క్లాసిక్ చిత్రాలు కూడా ఈయన ఖాతాలోనే ఉన్నాయి. ఈమధ్య కాలం లో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం వల్ల కాస్త డౌన్ అయ్యాడు కానీ, ఇప్పుడు మళ్లీ తండేల్ చిత్రం తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. నాగ చైతన్య కెరీర్ లో మాత్రమే కాదు, అక్కినేని ఫ్యామిలీ కి మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ సినిమా గా ఈ చిత్రం నిల్చింది.
Also Read: వాళ్లంతా సర్వనాశనం అయిపోతారు అంటూ శాపనార్ధాలు పెట్టిన మంచు లక్ష్మి!
ఇప్పుడు ఆయన విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ తో మిస్టిక్ థ్రిల్లర్ జానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండేల్ చిత్రం తో ఆడియన్స్ లో ఒక నమ్మకాన్ని సంపాదించిన నాగ చైతన్య, ఇప్పుడు తన పరిధి ని పెంచుకుంటూ సినిమా చేస్తుండడం తో, ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియన్స్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. దీనిని ట్రేడ్ కూడా గమనించడం తో 7 కోట్ల రూపాయలకు అవుట్ రైట్ గా ఈ సినిమాని కొనుగోలు చేసినట్టు సమాచారం. నాగ చైతన్య రేంజ్ కి ఇది చాలా ఎక్కువ అనే చెప్పాలి. కేవలం ఓవర్సీస్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడుపోతే, ఇక వరల్డ్ వైడ్ బిజినెస్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి ఏమి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎంత బజ్ క్రియేట్ చేస్తుంది అనేది.