Manchu Lakshmi fires: మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, విభిన్నమైన పాత్రలను పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi). ఈమె కేవలం ఒక నటిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా పలు ఆసక్తికరమైన కథలతో సినిమాలు తీసి, తన మార్కు ని క్రియేట్ చేసుకుంది. రీసెంట్ గానే ఈమె ‘దక్ష’ అనే చిత్రం తో మన ముందుకొచ్చింది కానీ, ఆ సినిమా ఆడియన్స్ ని అలరించలేదు. అసలు విడుదల అయ్యింది అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఒక చిన్న కాంట్రవర్సీ తో ఈ సినిమా పై హైప్ పెంచే ప్రయత్నం చేసింది కానీ, అది వర్కౌట్ అవ్వలేదు. రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ మాత్రం ఈ చిత్రానికి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నేను నా భర్త ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు అమెరికా లో ఉండేదానిని. ఆ తర్వాత ఇండియా కి తిరిగి వచ్చాము. కానీ మా ఆయన ఇక్కడ ఉండలేకపోయాడు. 2019 లో మళ్లీ అమెరికా కి వెళ్ళిపోయాడు. మీరే ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండండి అనేవాడు. దగ్గరుండి గొడవలు పడేదానికంటే దూరంగా ఉంటేనే మంచిది అని నేను కూడా ఒప్పుకున్నాను. నా కూతురుని మొదట్లో మా నాన్న స్కూల్ లోనే చదివించేదాన్ని. ఫ్రీ చదువు, నా కూతురికి లగ్జరీ లైఫ్, ఇవన్నీ నాకు నచ్చలేదు. నేను ఆ అమ్మాయిని అడవిలో వదిలేసినా బ్రతకగలిగేలా పెంచాలని అనుకున్నాను. అందుకే హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యి, అక్కడ ఒక చిన్న స్కూల్ లో చేర్పించాను’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక సోషల్ మీడియా లో వచ్చే ప్రచారాలపై మంచు లక్ష్మి చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ‘నా తమ్ముడు దక్ష మూవీ ప్రెస్ మీట్ కి వచ్చి మాట్లాడినప్పుడు కొన్ని యూట్యూబ్ చానెల్స్ చెత్త థంబ్ నైల్స్ పెడుతూ, నేను నా తమ్ముడు విష్ణు కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ప్రచారం చేశారు. ఇలా చేస్తే వాళ్లకు వచ్చేది ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఒక కుటుంబం లో ఇద్దరి మధ్య గొడవలు జరిగితే కలిపే లాగా ఉండాలి కానీ, వాళ్ళు విడిపోవాలని కోరుకుంటారా?, ఇలాంటి ప్రయత్నాలు చేసే వ్యక్తులు సర్వనాశనం అయిపోవాలి ‘అంటూ మంచు లక్ష్మి శాపనార్ధాలు పెట్టింది.