Leo collections : వరల్డ్ వైడ్ లియో రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు నిర్మాతలు వెల్లడించారు. యూఎస్ లో $5 మిలియన్ వసూళ్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటూ కోలీవుడ్ లో ఓ వర్గం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. కొందరు పిఆర్పీవోలు విజయ్ కి వ్యతిరేకంగా దారుణమైన పోస్ట్స్ పెడుతున్నారు. లియో కలెక్షన్స్ అబద్ధమా అంటే… అబద్దమే. ఆ విషయానికి వస్తే ప్రతి సినిమా కలెక్షన్స్ అబద్దమే. ప్రతి సినిమా వసూళ్ల ప్రకటనల్లో ఎంతో కొంత అబద్ధం ఉంది. కొన్ని సినిమాలు పొంతన లేకుండా భారీగా ఎక్కువ చేసి చెబుతారు. కొందరు వాస్తవానికి దగ్గరగా చూపిస్తారు.
ఇండియాలో టికెట్ ట్రాకింగ్ సిస్టం లేదు. ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకునే వారి సంఖ్య యాభై శాతం కూడా ఉండదు. నేరుగా థియేటర్లో టికెట్ కొనేవారి సంఖ్య, వసూళ్లకు ఖచ్చితమైన ప్రామాణికం ఉండదు. సినిమాకు హైప్ తెచ్చేందుకు, తమ సినిమాలో విషయం ఉంది. అందుకే వసూళ్లు బాగా వస్తున్నాయని ప్రేక్షకులను ఏమార్చేందుకు… ఎక్కువ చేసి పోస్టర్స్ విడుదల చేస్తారు. ఇటీవల నిర్మాత సూర్యదేవర నాగవంశీ షాకింగ్ కామెంట్స్ చేశారు.
అసలు నిజమైన వసూళ్ల లెక్కలు మేము బయటకు చెప్పం. అవి కేవలం డిస్ట్రిబ్యూటర్, నిర్మాత మధ్య ఉండిపోతాయి. అసలు ఈ నిర్మాత కూడా ఖచ్చితమైన వసూళ్ల వివరాలు వెల్లడించరు అన్నారు. లియో విషయంలో కూడా అదే జరిగింది. లియో ఫస్ట్ షో నుండి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. లియో ప్లాప్ అంటూ యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వైరల్ చేశారు. అయితే టాక్ తో సంబంధం లేకుండా లియో మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలో అడుగుపెట్టింది.
ఇదిలా ఉంటే లియో ఫేక్ కలెక్షన్స్ అనే ఆరోపణలపై దర్శకుడు లోకేష్ కనకరాజ్ నేరుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. థియేటర్లో నేను ఆడియన్స్ రెస్పాన్స్ నేరుగా చూశాను. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయ్యిందని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. దాన్ని నేను అంగీకరిస్తాను. ఇక లియో కలెక్షన్స్ అనేవి ప్రొడ్యూసర్ కి సంబంధించిన విషయం, అన్నారు. లోకేష్ కనకరాజ్ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.
లియో మూవీలో విజయ్ కి జంటగా త్రిష నటించింది. అర్జున్, సంజయ్ దత్ కీలక రోల్స్ చేశారు. అనిరుధ్ సంగీతం అందించారు.