Prabhas Raja Saab Leak: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas), మారుతి(Maruthi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ది రాజా సాబ్'(RajaSaab Teaser) మూవీ టీజర్ ఈ నెల 16 న విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ నేడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. టీం ఒక్కసారిగా ఈ లీక్ విషయం తెలుసుకొని ఉలిక్కిపడింది. ఎవరైనా ఆ లీకైన టీజర్ కి సంబంధించిన షాట్స్ ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది.
Also Read: The Raja Saab: ది రాజా సాబ్ నుంచి అదిరిపోయే అప్ డెట్
అయితే లీకైన ఈ టీజర్ ని చూసినవాళ్లు చెప్తున్న మాటలు అభిమానుల్లో క్యూరియాసిటీ ని ఒక రేంజ్ లో పెంచేస్తున్నాయి. డైరెక్టర్ మారుతి ని చాలా తక్కువ అంచనా వేశాము, ఈ రేంజ్ ఔట్పుట్ ఇస్తాడని మేము కలలో కూడా ఊహించలేదంటూ అభిమానులు చెప్తున్నారు. ముఖ్యంగా టీజర్ లో హీరోయిన్ మాళవిక మోహనన్ మొసలి నోట్లోకి వెళ్లి ఫైట్ చేసిన షాట్ వేరే లెవెల్ లో ఉందని, అయితే అది మొసలి నా?, లేకపోతే గాడ్జిల్లానా అనేది క్లారిటీ గా తెలియడం లేదు. బహుశా టీజర్ విడుదల అయ్యాక క్లారిటీ రావొచ్చు. కేవలం హీరోయిన్ మాత్రమే కాదు,ప్రభాస్ కూడా మొసలితో ఫైట్ చేస్తాడట. ఈ షాట్ చూసే ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడిచే లాగా ఉంటాడని,ప్రభాస్ వింటేజ్ రోజుల్లో ఎలాంటి లుక్స్ లో కనిపించేవాడో, ఈ టీజర్ లో అలా కనిపించాడని,అభిమానులకు విజువల్ ఫీస్ట్ లాగ ఉంటుందని అంటున్నారు.
Oo pani cheyyandi cinema motham G drive lo ekkinchi pampandi… Nenu , @RodRaisar gaadu kalipi evening kalla amoeba teaser odulthampic.twitter.com/SNF5Qs9el7
— Zunk️ (@UrstrulyZunk) June 13, 2025
మరోపక్క టీజర్ ని లీక్ చేసిన వారిపై మూవీ టీం చాలా ఫైర్ మీద ఉంది. కొంతమంది చెప్పేది ఏమిటంటే ఈ సినిమాకు హైప్ ని తీసుకొని రావడం కోసం PR టీం కావాలని లీక్ చేయించి ఉంటుందని అంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ టీజర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్స్ లో అభిమానుల కోసం ప్రదర్శించబోతున్నారట. ఆ థియేటర్స్ లిస్ట్ ని కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు రాజా సాబ్ చిత్రం పై ట్రేడ్ లో పెద్దగా అంచనాలు లేవు కానీ, ఈ టీజర్ తర్వాత ఆ అంచనాలు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం లో మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ కూడా హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్ ఇందులో ప్రభాస్ తాత పాత్రలో కనిపించబోతున్నాడు.