Thug Life Karnataka Release date: ‘థగ్ లైఫ్'(Thug Life) మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్(Kamal Haasan) కన్నడ లో ప్లాన్ చేసిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ‘కన్నడ భాష కూడా తమిళం నుండి పుట్టినదే’ అంటూ మాట్లాడాడు. దీనిపై కన్నడ ప్రజానీకం భగ్గుమంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా కమల్ హాసన్ కి ప్రజల మనోభావాలను అవమానించే హక్కు లేదు, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలి. లేకపోతే ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చెయ్యనివ్వము అంటూ హెచ్చరికలు జారీ చేశారు. కర్ణాటక హై కోర్టు కూడా ఈ చిత్రం బ్యాన్ విధించింది. అయినప్పటికీ కమల్ హాసన్ తగ్గలేదు, నేను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను తప్పుగా ఏమి మాట్లాడలేదు, అలాంటప్పుడు నేనెందుకు క్షమాపణలు చెప్పాలి?, నేను చెప్పను, కావాలంటే బ్యాన్ చేసుకోండి అంటూ చెప్పుకొచ్చాడు. అలా ఈ సినిమా కర్ణాటక లో విడుదలకు నోచుకోలేదు.
Rule of law demands that any film which has a CBFC certificate must be released and the State has to ensure its screening, the Court said.
Read more: https://t.co/JrpimZRRZp#SupremeCourtofIndia #ThugLife #Karnataka #KamalHaasan pic.twitter.com/nKGRnwyYLy— Live Law (@LiveLawIndia) June 17, 2025
దీంతో కమల్ హాసన్ సుప్రీమ్ కోర్టును(Supreme Court) ఆశ్రయించాడు. సుప్రీమ్ కోర్టు నుండి కమల్ హాసన్ కి ఊరట కలిగించే తీర్పు వచ్చింది. కమల్ హాసన్ ని క్షమాపణలు ఆడోగొద్దని కర్ణాటక హై కోర్టు ని ఆదేశిస్తూ కేవలం ఒక్క రోజులోనే ఈ సినిమాని విడుదల చేయాలని అల్టిమేటం జారీ చేసింది. వందల మంది కష్టపడి పని చేసిన ఒక సినిమాని బ్యాన్ చేయడం సరైన పద్దతి కాదని, ఏదైనా ఇబ్బంది కరమైన వ్యాఖ్యలుగా అనిపిస్తే కూర్చొని మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకోవాలి కానీ, ఇలా చేయడం సరైన పద్దతి కాదంటూ సుప్రీమ్ కోర్టు చెప్పుకొచ్చింది. ఉన్నత స్థాయి కోర్టు చెప్పిందంటే కచ్చితంగా చేసి తీరాల్సిందే. అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏమి ప్రయోజనం చెప్పండి. ఓపెనింగ్స్ సమయంలో సుప్రీమ్ కోర్టు ఆదేశాలు జారీ చేసి ఉండుంటే ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ మార్కుని దాటేదెమో.
కానీ సినిమా థియేట్రికల్ రన్ మొత్తం పూర్తి అయ్యాక ఓటీటీ లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఈ సమయంలో కర్ణాటక లో విడుదల చేస్తే ఎవరు చూస్తారు?, కొత్త సినిమాలు ప్రస్తుతానికి విడుదలకు దగ్గర్లో లేనందున థియేటర్స్ ఫీడింగ్ కోసం మాత్రమే ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉంటుంది. పైగా ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి,విశ్లేషకుల నుండి ఘోరమైన రేటింగ్స్ వచ్చాయి. బుక్ మై షో యాప్ లో కేవలం 4.9 రేటింగ్స్ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు, ఎంతటి ఘోరమైన ఫ్లాప్ అనేది. ఈ సినిమాకు అన్ని భాషలకు కలిపి కేవలం 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది కమల్ హాసన్ స్థాయికి అవమానకరమైన వసూళ్లు అనొచ్చు. ఆయన గత చిత్రం ‘ఇండియన్ 2’ కూడా పెద్ద ఫ్లాప్ అయ్యింది. కానీ ఆ సినిమాకు ఫుల్ రన్ లో 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఈ సినిమాకు వంద కోట్ల గ్రాస్ కూడా రాకపోవడం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.