spot_img
Homeఎంటర్టైన్మెంట్Dil Raju Studio In Hyderabad: అత్యాధునిక టెక్నాలజీ తో హైదరాబాద్ లో దిల్ రాజు...

Dil Raju Studio In Hyderabad: అత్యాధునిక టెక్నాలజీ తో హైదరాబాద్ లో దిల్ రాజు స్టూడియోస్..

Dil Raju Studio In Hyderabad: నైజం ప్రాంతం లో చిన్న డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని ప్రారంభించి ఎన్నో విజయవంతమైన సినిమాలు ఆ ప్రాంతం లో విడుదల చేసి ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి ఇండస్ట్రీ లో తిరుగులేని స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న వ్యక్తి దిల్ రాజు..ఇండస్ట్రీ లో దిల్ రాజు ప్రొడక్షన్ నుండి వస్తున్నా సినిమా అంటే కచ్చితంగా సూపర్ హిట్ అనే బ్రాండ్ ఇమేజి ఉంది..క్రేజీ హీరోలతో సినిమాలను నిర్మిస్తూ ఎన్నో బాక్స్ ఆఫీస్ వండర్స్ సృష్టించిన సినిమాలు నిర్మించిన దిల్ రాజు, డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాడు..రీసెంట్ గా సంచలన విజయాలుగా నమోదు చేసుకున్న #RRR మరియు KGF వంటి సినిమాలను నైజం ప్రాంత హక్కులను కొనుగోలు చేసింది దిల్ రాజు గారే..ఈ రెండు సినిమాలకు లాభాలు ఏ స్థాయిలో వచ్చాయో మన అందరికి తెలిసిందే..ఇలా వరుస విజయాలతో కెరీర్ లో పీక్ స్టేజి ని ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు కి ఇటీవలే ఒక కొడుకు పుట్టాడు..మొదటి భార్య చనిపోయిన తర్వాత దిల్ రాజు రెండవ పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే.

Dil Raju Studio In Hyderabad
Dil Raju

అయితే కొడుకు పుట్టిన తర్వాత దిల్ రాజు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు..అదేమిటి అంటే అతి త్వరలోనే ఆయన హైదరాబాద్ లో ఒక్క ఫిలిం స్టూడియో ని నిర్మించబోతున్నారట..అత్యాధునిక టెక్నాలజీ తో కనివిని ఎరుగని హంగులతో ఈ స్టూడియో నిర్మాణం కాబోతుంది..త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన దిల్ రాజు గారు చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..సుమారు 300 కోట్ల రూపాయిలు ఈ స్టూడియో నిర్మించడానికి ఖర్చు అవుతుంది అని తెలుస్తుంది..కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు..వైజాగ్ లో కూడా ఒక స్టూడియో నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే సినీ నిర్మాతలకు వైజాగ్ లో స్టూడియో కట్టుకునే ప్రతిపాదన తో వస్తే స్థలాలు ఉచితంగా ఇస్తాను అని అధికారిక ప్రకటన చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..దానితో దిల్ రాజు వైజాగ్ లో కూడా స్టూడియో నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది..ఇది పక్కన పెడితే దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో ఒక్క భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా తీస్తున్న విషయం మనకి తెలుసు..ఈ షూటింగ్ ప్రస్తుతం శెరవేగంగా సాగుతుంది..నవంబర్ లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు దిల్ రాజు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper