Dil Raju Interview: ఇప్పటికే ఇండియాలో ఉన్న చాలా మంది నటులు పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు(Dil Raju)… ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు…ఇక ఇప్పటివరకు ఆయన చాలా సెలెక్టెడ్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తన ఎంటైర్ కెరీర్ లో స్టార్ డైరెక్టర్లతో చాలా తక్కువ సినిమాలను చేశాడు. ఇక స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నప్పటికి చాలా క్యాలీక్లేటేడ్ గా ముందుకు సాగుతున్న దిల్ రాజు ఇప్పటివరకు నష్టాలను చవి చూసింది లేదు. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా మినిమం గ్యారంటీగా ఉంటుంది. అందువల్లే ఆయన ఇన్ని సంవత్సరాల పాటు స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగలుగుతున్నాడు. ఇక తనకు స్టార్ హీరోలతో ఉన్న బాండింగ్ ను బట్టి వాళ్లను ఒక్కొక్కరిని ఒక్కోరకంగా పిలుస్తూ ఉంటానని చెప్పాడు.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి..ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వనున్న టీం?
రీసెంట్ గా నితిన్ తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో దానికి సంబంధించిన క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక ఎవరిని ఎలా పిలిచిన కూడా ఎన్టీఆర్ ను మాత్రం నాన్న అని పిలుస్తూ ఉంటానని తనకు మొదటి నుంచి కూడా అతనితో అంత మంచి బాండింగ్ ఉందని తెలియజేశాడు. ఇక నాన్న అని పిలవడం వెనక కూడా అసలైన సీక్రెట్ తెలియజేశాడు…జూనియర్ ఎన్టీఆర్ ఆది (Aadi) సినిమా చేస్తున్న సమయంలో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు అప్పుడు ఎన్టీఆర్ తో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడట.
ఇక తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కొడాలి నాని లాంటివారు జూనియర్ ఎన్టీఆర్ ను నాన్న అని పిలుస్తూ ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ కంటే ఏజ్ లో పెద్దవాడైన దిల్ రాజు కూడా నాన్న అని పిలవడం స్టార్ట్ చేశారట. ఇక అప్పటినుంచి జూనియర్ ఎన్టీఆర్ దిల్ రాజుని అన్నా అనిపిస్తే దిల్ రాజు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని నాన్న అని పిలుస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటున్నాడు.
Also Read: ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ లో కేతిక శర్మ ఐటెం సాంగ్..ఊహకందని రెమ్యూనరేషన్!
ఇంకా వీళ్ళ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలైతే వచ్చాయి. అందులో ఒకటి బృందావనం కాగా, రెండోది ‘రామయ్య వస్తావయ్యా’ ఈ రెండు సినిమాల్లో బృందావనం సూపర్ హిట్ అవ్వగా, రామయ్య వస్తావయ్య డిజాస్టర్ గా మారింది…
ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు జూనియర్ ఎన్టీఆర్ కి అంత సన్నిహితంగా ఉంటాడా అనే విషయాన్ని తెలుసుకొని అభిమానులు ఆనంద పడుతున్నారు…
