New DGP Kerala: రాష్ట్ర ప్రభుత్వంలో పాలనాపరంగా గవర్నర్( governor), రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి పోస్టులు కీలకం దేశంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు సేవలందిస్తున్నారు. తాజాగా ఏపీకి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ కేరళ డీజీపీగా నియమితులయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన ఆయన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసులో ఉండేవారు. ఐబీ లో స్పెషల్ డైరెక్టర్ గా పనిచేసేవారు. ఆయనను కేరళ డిజిపిగా సీఎం వినరాయి విజయన్ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. చంద్రశేఖర్ గతంలో కేరళలో వివిధ హోదాల్లో పనిచేశారు. వచ్చే ఏడాది జూలైలో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అప్పటివరకు ఆయనే కేరళ డీజీపీగా కొనసాగనున్నారు. కేరళ ప్రస్తుత డిజిపిగా ఉన్న షేక్ దర్వేషణ్ సాహెబ్ సోమవారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో డిజిపిగా చంద్రశేఖర్ నియమితులయ్యారు.
Also Read: నటితో పెళ్లి.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ కెరియర్ క్లోజ్!
సీనియర్ ఐపీఎస్ అధికారిగా
చంద్రశేఖర్ ( Chandrashekhar)కేరళలో సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే సేవలు అందిస్తున్నారు. కేరళ డీజీపీగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. కేరళలో పనిచేసే అనుభవం ఉన్నందున సమర్థవంతంగా విధులు నిర్వహిస్తానని చంద్రశేఖర్ చెబుతున్నారు. వీరవాస వరంకు చెందిన చంద్రశేఖర్ 1991లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. కేరళలో వివిధ హోదాల్లో పని చేశారు. కేరళలోని వయానాడ్, పాలక్కాడ్ జిల్లాలకు ఎస్పీగా.. తిరువనంతపురం సిటీ పోలీస్ కమిషనర్ గా.. త్రిష్మూర్, కొచ్చి రేంజ్ డిఐజిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. 2017లో చంద్రశేఖర్ డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఏపీ కేంద్రంగా ఎక్కువ కాలం ఇంటలిజెన్స్ బ్యూరోలో విధులు నిర్వహించారు. కేంద్ర డిప్యూటేషన్ పై ఇంటెలిజెన్స్ బ్యూరోకి డిఐజిగా కూడా వ్యవహరించారు.
Also Read: 45 ఏళ్ల వయసులో పెళ్లి.. భార్య ఘాతుకంతో ముళ్ల పొదల్లో శవంగా..
ఐబీ లో వివిధ హోదాల్లో..
ఇంటెలిజెన్స్ బ్యూరోలో( Intelligence Bureau ) వివిధ హోదాల్లో పని చేశారు చంద్రశేఖర్. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, భువనేశ్వర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిఐజి, ఐజి, ఏడీజీపీ, డైరెక్టర్ జనరల్ తో సహా అనేక సీనియర్ పదవులను నిర్వహించారు. ఇటీవల క్యాబినెట్ సెక్రటేరియట్ లో సెక్యూరిటీ వింగ్ లో నియమితులయ్యారు. ఆ బాధ్యతలను ఆగస్టులో ఆయన చేపట్టాల్సి ఉంది. కానీ ఇంతలోనే కేరళ ప్రభుత్వం డిజిపిగా నియమించింది. ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ కేరళ డీజీపీగా నియమితులు కావడంతో వీరవాసరంలో బంధువులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
I congratulate Telugu man Ravada Chandrasekhar appointed as the new Kerala police chief (DGP ). The 1991-batch IPS officer. His commitment to law and order will definitely get good name for the department – I wish him all the best #kerala pic.twitter.com/JW4jmSzoj9
— Dr Srinubabu Gedela (@DrSrinubabu) July 1, 2025