Megastar Chiranjeevi Ustaad Bhagat Singh: అధికారం లోకి వచ్చిన పది నెలల వరకు ఉప ముఖ్యమంత్రి బాధ్యత లో ఫుల్ బిజీ గా గడిపిన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) షూటింగ్స్ కి ఎంత దూరం గా ఉండేవాడో మన అందరికీ తెలిసిందే. అభిమానులు ప్రతీ రోజు చేతిలో ఉన్న ఆ మూడు సినిమాలను పూర్తి చెయ్యమని ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ కి కాస్త సమయం దొరకడంతో వరుసగా తన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’,’ఓజీ’ చిత్రాలను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉంటున్నాడు. ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా గత మూడు వారాల నుండి ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు.
Also Read: చిరంజీవి సపోర్ట్ వల్లే ఆ నటుడు స్టార్ హీరోగా ఎదిగాడా..?
ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. నిన్న ఈ మూవీ సెట్స్ కి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) విచ్చేసాడాట. కాసేపు పవన్ కళ్యాణ్ తో మరియు మూవీ టీం తో సంభాషించి, సరదాగా వాళ్ళతో గడిపి వెళ్ళాడట. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అన్నదమ్ములను ఒకే చోట చూసి చాలా రోజులైంది అంటూ అభిమానులు సంతోషంతో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటో అధికారికంగా బయటకు రాలేదు. అభిమానుల ద్వారా విడుదల అయ్యింది. మూవీ టీం నుండి ఒక స్పెషల్ వీడియో వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. త్వరలోనే మెగాస్టార్ వచ్చి సెట్స్ లో గడిపిన క్షణాలను వీడియో గా విడుదల చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి మరి.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరియు శ్రీలీల పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లోనే ఒక సాంగ్ ని కూడా చిత్రీకరిస్తారట. ఈ నెలాఖరు లోపు 50 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో షూటింగ్ మొత్తం పూర్తి చేసి సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారని టాక్. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజాకీయ కార్యకలాపాల్లో బిజీ అవ్వబోతున్నారు అట. ఆ తర్వాత కొన్నాళ్ళకు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. సురేందర్ రెడ్డి తో కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కానీ ఆ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
Megastar Chiranjeevi visited the sets of #UstaadBhagatSingh for a short time today.#PawanKalyan pic.twitter.com/Rl9Ok0XBQK
— Telugu Chitraalu (@TeluguChitraalu) June 30, 2025