Mahesh Babu Khaleja: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాని శాసించే స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన స్టార్ హీరోలు పాన్ వరల్డ్ లెవెల్ కి దూసుకెళ్తున్నారు. మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. రాజమౌళి పుణ్యమాని మహేష్ బాబు డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా చేస్తుండటం విశేషం…
Also Read: చిరంజీవి సపోర్ట్ వల్లే ఆ నటుడు స్టార్ హీరోగా ఎదిగాడా..?
రాజకుమారుడు (Rajakumarudu) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు (Mahesh Babu)…ఆయన చేసిన సినిమా అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతల మంచి పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకులను సైతం చేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు కెరియర్ లో చేసిన ఒక్కడు,పోకిరి, దూకుడు లాంటి సినిమాలు అతన్ని స్టార్ హీరోని చేశాయి. ఆ తర్వాత చేసిన సినిమాలు సైతం అతనికి గొప్ప గుర్తింపుని తీసుకురావడం విశేషం…ఇక ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన అన్ని సినిమాల్లో భారీ ఎలివేషన్స్, ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలు అయితే ఉన్నాయి. కానీ ఆయన ఒక సినిమాలో ఆయనకు ఎలివేషన్స్ ఇచ్చిన విధానంగాని ఆయన పాయింట్ ఆఫ్ లో అతన్ని ఎస్టాబ్లిష్ చేసిన పద్ధతి గాని ప్రేక్షకులను హై ఎమోషన్ లోకి తీసుకెళ్ళిందనే చెప్పాలి. ఇంతకీ ఆ సినిమా ఏంటి ఆ సీన్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
మహేష్ బాబు కెరియర్ లో అండరేటెడ్ సినిమాగా మిగిలిపోయిన ఖలేజా (Khaleja) సినిమాలో మహేష్ బాబు చాలా వరకు కామెడీని పండిస్తూ తనలో కామెడీ యాంగిల్ కూడా ఉందని ప్రేక్షకులకు గుర్తు చేశాడు…ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కోసం రావు రమేష్ షఫీ కి చెప్పే సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇక దానికి మించి ఇంటర్వెల్ సీన్ లో మహేష్ బాబు ఫైట్ చేసిన తర్వాత షఫీ అతని దగ్గరికి వచ్చి మాట్లాడే సీక్వెన్స్ గాని ఆనవాళ్లను పట్టుకునేటప్పుడు అతనికి సహకరించిన విధానంగాని అవి ఇప్పటివరకు ఏ సినిమాలో చూడనటువంటి ఒక హై అండ్ ఎలివేషన్ అండ్ ఎమోషన్స్ సీన్స్ అనే చెప్పాలి.
మహేష్ బాబు ఎంటైర్ కెరియర్ లో ఆ సీన్ ను మించిన సీన్ మరొకటి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న సినిమాలో ఇంతకు మించిన సన్నివేశాలు ఏమైనా ఉంటాయా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
