Balakrishna Help Chiranjeevi Career: తెలుగు తెరమీద చెరిగిపోని ముద్ర వేసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని నెక్స్ట్ లెవల్లో నిలిపాయి. ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలను చేస్తున్నాడు అంటే చిరంజీవికి ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. కెరియర్ స్టార్టింగ్ లో ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీ రిసీడల్డ్ లను బ్రేక్ చేశాయి. ఒక రకంగా అతను మెగాస్టార్ గా మారడానికి నందమూరి బాలకృష్ణ కూడా చాలా వరకు హెల్ప్ చేశాడు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. కారణం ఏంటి అంటే బాలయ్య బాబు దగ్గరికి వచ్చిన చాలా సినిమాలను అతను రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాలను చిరంజీవి చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు.
Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు
అందులో ముఖ్యంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా కథ మొదట బాలయ్య బాబు దగ్గరికి వెళ్లిందట. బాలయ్య బిజీగా ఉండి ఆ కథను రిజెక్ట్ చేయడంతో చిరంజీవి ఆ సినిమాను చేసి ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
‘గ్యాంగ్ లీడర్’ సినిమా సైతం మొదట బాలయ్య బాబుతో చేయాలని అనుకున్నారట. కానీ అందులో పెద్దగా వైవిధ్యం లేదని బాలయ్య దాన్ని రిజెక్ట్ చేశాడు. దాంతో ఆ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి చిరంజీవి తో ఆ సినిమాను చేసి ఇండస్ట్రీ హిట్ సాధించారు. మొత్తానికైతే చిరంజీవి ఖాతాలో రెండు ఇండస్ట్రీ హిట్లు పడడానికి బాలయ్య బాబే కారణం అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాలను చిరంజీవి చేశారంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఇక ఈ సినిమాలను బాలయ్య బాబు చేసిన కూడా అతనికి బాగా సెట్ అయ్యేవని మరి కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు అంటే అందులో బాలయ్య బాబు రిజెక్ట్ చేసిన సినిమాల పాత్ర కూడా చాలానే ఉంది అని మరి కొంతమంది చెబుతున్నారు…