Homeఎంటర్టైన్మెంట్Dhurandhar OTT: నెట్ ఫ్లిక్స్ లో అన్ని రికార్డ్స్ అవుట్..2 వారాల్లో 'ధురంధర్' చిత్రానికి వచ్చిన...

Dhurandhar OTT: నెట్ ఫ్లిక్స్ లో అన్ని రికార్డ్స్ అవుట్..2 వారాల్లో ‘ధురంధర్’ చిత్రానికి వచ్చిన వ్యూస్ ఎంతంటే!

Dhurandhar OTT: థియేటర్స్ లోనే కాదు, నెట్ ఫ్లిక్స్ లో కూడా ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం అనితర సాధ్యమైన రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతోంది. థియేటర్స్ లో ఈ చిత్రం కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే విడుదలైంది. ఈ సినిమాకు వచ్చిన టాక్ ని చూసి, అన్ని భాషలకు సంబంధించిన ఆడియన్స్ తాము కూడా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో తమ భాషలో చూడాలని ఆశపడ్డారు. మేకర్స్ ని ఆ మేరకు పెద్ద ఎత్తున […]

Dhurandhar OTT: థియేటర్స్ లోనే కాదు, నెట్ ఫ్లిక్స్ లో కూడా ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం అనితర సాధ్యమైన రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతోంది. థియేటర్స్ లో ఈ చిత్రం కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే విడుదలైంది. ఈ సినిమాకు వచ్చిన టాక్ ని చూసి, అన్ని భాషలకు సంబంధించిన ఆడియన్స్ తాము కూడా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో తమ భాషలో చూడాలని ఆశపడ్డారు. మేకర్స్ ని ఆ మేరకు పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేశారు. కానీ సమయం లేకపోవడం తో థియేటర్స్ లో విడుదల చేయలేకపోయారు. కానీ నెట్ ఫ్లిక్స్ లో మాత్రం అన్ని భాషల్లోనూ విడుదల చేస్తారని సమాచారం రావడంతో మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ చిత్రం కోసం ఎదురు చూశారు. నెట్ ఫ్లిక్స్ లో రాగానే ఈ చిత్రం పై అందరూ ఒక్కసారిగా దండయాత్ర చేశారు.

దీంతో కనీవినీ ఎరుగని రేంజ్ వ్యూస్ ఈ చిత్రానికి సొంతం అయ్యాయి. జనవరి 30 నుండి ఫిబ్రవరి 1 వరకు ఈ చిత్రానికి 76 లక్షల వ్యూస్ రాగా, ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 8 వరకు ఈ చిత్రానికి అదనంగా మరో 82 లక్షల వ్యూస్ వచ్చాయి. మొత్తం మీద ఈ చిత్రానికి 10 రోజుల్లో 15.8 లక్షల వ్యూస్ వచ్చాయి. చాలా ఇండియన్ సినిమాలకు సంవత్సరాల తరబడి నెట్ ఫ్లిక్స్ లో ఉంటున్నప్పటికీ రానటువంటి వ్యూస్ , ఈ చిత్రానికి కేవలం 10 రోజుల్లో వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం ఎలాంటి సునామీ క్రియేట్ చేసింది అనేది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం కచ్చితంగా #RRR సాధించిన 43 మిలియన్ వ్యూస్ రికార్డు ని బద్దలు కొట్టి, సరికొత్త ఇండియన్ రికార్డు ని నెలకొల్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.

ఇక పోతే ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ చిత్రం వచ్చే నెల 19న విడుదల కాబోతుంది. మొదటి భాగం ఎవ్వరూ ఊహించనంత బ్లాక్ బస్టర్ అవ్వడం తో రెండవ భాగం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందో లేదో తెలియదు కానీ, ఒకవేళ అంచనాలు అందుకుంటే మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 3000 కోట్లు రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈసారి హిందీ తో పాటు తెలుగు , తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper